Simhadri: సంతోషంలో యంగ్ టైగర్ ఫ్యాన్స్.. ఆ కోరిక తీరడంతో?

  • April 24, 2023 / 04:34 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి మూవీ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంకిత, భూమిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం. అయితే మే నెల 20వ తేదీన సింహాద్రి మూవీ రీరిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా (Simhadri) రీరిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. రీరిలీజ్ లో కలెక్షన్ల విషయంలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అతిపెద్ద స్క్రీన్ పై ఈ సినిమా ప్రదర్శితం కానుందని సమాచారం అందుతోంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్స్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ ఉండగా అక్కడ సింహాద్రి మూవీ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

అక్కడ స్పెషల్ షో ప్రదర్శితం కానుందని ఫ్యాన్స్ అధికారక ప్రకటన చేయడం గమనార్హం. సింహాద్రి సినిమాను ఫ్యాన్స్ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా గ్రాండ్ గా రీరిలీజ్ అయ్యేలా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. తారక్, రాజమౌళి సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను ప్రమోట్ చేసినా ఈ సినిమా రేంజ్ మారుతుందని చెప్పవచ్చు. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్నారు.

కొరటాల శివ సినిమాతో తారక్ పాన్ ఇండియా స్థాయిలో మరోసారి తన పేరు మారుమ్రోగేలా చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సింహాద్రి అప్పట్లో 26 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. 100 డేస్, 175 డేస్ సెంటర్ల విషయంలో ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. ఈతరం ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus