Similarities and Differences between Jr NTR and Ram Charanరాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మార్చి నెల 25వ తేదీన థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుంది. ఈసారి ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆ తేదీకి ఈ సినిమా కచ్చితంగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మార్చి 25వ తేదీ కోసం చరణ్, తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆ అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
అయితే తాజాగా ఒక సందర్భంలో ఈ సినిమాలో హీరోలుగా నటించిన చరణ్, తారక్ మధ్య తేడాను రాజమౌళి చెప్పుకొచ్చారు. చాలామంది ఈ ఇద్దరు హీరోల మధ్య తేడా ఏంటని అడుగుతున్నారని ఇద్దరి మధ్య ఒక విషయంలో వైరుధ్యం ఉందని జక్కన్న అన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక సీన్ లో చరణ్ అద్భుతంగా నటించాడని మానిటర్ లో చరణ్ నటించిన సన్నివేశాన్ని చూసి తాను ఆశ్చర్యానికి గురయ్యానని రాజమౌళి వెల్లడించారు. చరణ్ కు ఆ సీన్ అద్భుతంగా చేశావని చెప్పగా చరణ్ మాత్రం తాను అలా చెప్పినా ఎగ్జైట్ కాలేదని రాజమౌళి కామెంట్లు చేశారు.
చరణ్ మానిటర్ లో సీన్ చూసుకుని బాగా చేశానా? ఓకేనా? అని అడిగారని జక్కన్న చెప్పుకొచ్చారు. చరణ్ మంచి నటుడు అయినప్పటికీ తనపై తనకు కాన్ఫిడెన్స్ తక్కువని రాజమౌళి తెలిపారు. ఎన్టీఆర్ మాత్రం అద్భుతంగా చేశావని చెప్పడానికి ముందే ఇరగ్గొట్టేశాను కదా అని చెబుతారని ఆ కాన్ఫిడెన్స్ తనలో ఉంటుందని రాజమౌళి అన్నారు. చరణ్, తారక్ గురించి రాజమౌళి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తారక్, చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని తారక్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.