ఇటీవల ఓ ఈవెంట్లో సిమ్రాన్ (Simran) కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. తాను ఓ సినిమా చూసి… అందులో కీలక పాత్ర పోషించిన నటికి ఫోన్ చేసి ‘బాగా చేశావు’ అని అభినందిస్తే.. ‘ఆంటీ రోల్స్ కంటే ఇవి బెటరే’ అని ఆమె సిమ్రాన్ ని పరోక్షంగా హేళన చేసినట్టు చెప్పుకొచ్చింది. అందుకు సిమ్రాన్ … “‘సినిమాల్లో పనికిమాలిన డబ్బా రోల్స్ చేసే కంటే.. అవకాశం ఉంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు చేయడం చాలా బెటర్. ఎలాంటి పాత్రలు చేసినా హుందాగా ఉండాలి.
మనల్ని ఏదో ఒక రకంగా అవి ముందుకు నడిపించాలి. అన్నిటికీ మించి మనపై మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే మనం ధైర్యంగా ముందుకు సాగుతాం. పక్కవాళ్ళని చులకనగా చూడకూడదు” అంటూ చురకలు అంటించినట్టు చెప్పి షాకిచ్చింది సిమ్రాన్. దీంతో ఆ సీనియర్ హీరోయిన్ ఎవరా? అనే డిస్కషన్ మొదలైంది. ఈ క్రమంలో జ్యోతిక (Jyothika) పేరు ఎక్కువగా వైరల్ అయ్యింది. ఆమె ఇటీవల ‘డబ్బా కార్టెల్’ లో నటించింది.
దీంతో ఆ డబ్బా నటి జ్యోతికే అని తమిళ సోషల్ మీడియా డిసైడ్ చేసేసింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో సిమ్రాన్ పాల్గొంది. అందులో ఈ విషయమై ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సిమ్రాన్ ‘ఆమె ఒకప్పుడు నాతో కలిసి చేసిన నటే. తర్వాత క్షమాపణలు చెప్పింది’ అంటూ సిమ్రాన్ చెప్పుకొచ్చింది. కానీ ఆమె పేరు మాత్రం చెప్పలేదు. దీంతో ఇక జనాలు జ్యోతికే అని ఫిక్స్ అయిపోయారు.