సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ మధ్యనే గద్దర్ మరణించారు. ఆ చేదు వార్త విని 24 గంటలు గడవకుండానే తమిళ నటి సింధు క్యాన్సర్ తో మరణించింది.. ఆ వెంటనే కన్నడ నటుడు విజయ్ భార్య స్పందన గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆ తర్వాత హాలీవుడ్ దర్శకుడు ఫ్రిడ్ కిన్ కూడా మరణించారు. అంతేకాదు మలయాళ సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడు సిద్ధిఖీ కూడా గుండెపోటు మరణించారు.
మలయాళ డైరెక్టర్ బాబీ మోహన్ కూడా గత వారం 45 సంవత్సరాలకే మరణించడం జరిగింది. ఇక తాజాగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు పాల్ రెబెన్స్ కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఈ చేదు వార్త విని 24 గంటలు గడవకముందే మరో విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువ గాయకుడు మిచి కోబిన్ (Michi Kobin ) కూడా క్యాన్సర్ తో మరణించారు. చిన్నప్పటి నుండి ఇతనికి పాటలు పడటం అంటే విపరీతమైన ఇష్టం.
అదే ఇతన్ని పాపులర్ సింగర్ అయ్యేలా చేసింది.అనేక స్టేజి షోలలో ఇతను పాటలు పాడటం జరిగింది. అంతేకాకుండా AR01 బ్యాండ్ కి కూడా పనిచేశాడు. అయితే కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతూ వస్తున్నాడు ఇతను. అందుకోసం మెరుగైన చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. పరిస్థితి విషమించడంతో అతను కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసి.. సంతాపం తెలిపారు.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!