దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలను పాడిన చిన్మయి ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పారు. అయితే మీటూ ఉద్యమం ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇలా అప్పటినుంచి ఈమె సమాజంలో మహిళలకు మద్దతు తెలుపుతూ తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు.
ఇకపోతే తాజాగా సింగర్ (Chinmayi) చిన్మయి తమిళ ప్రముఖ రచయిత వైరముత్తును టార్గెట్ చేస్తూ కమల్ హాసన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కమల్ హాసన్ చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ షాకింగ్ సమాధానం చెప్పారు. ఇండియన్ రెజ్లర్లు బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ సైతం వీరికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు.
నేషనల్ గ్లోరీ కోసం పోరాడాల్సిన రెజ్లర్లు వ్యక్తిగత భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారతీయులారా మన అటెన్షన్ కి ఎవరు అర్హులు ? క్రీడాకారులా లేక నేర చరిత్ర కలిగిన నేతలా అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన సింగర్ చిన్మయి స్పందిస్తూ మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై ప్రశ్నించినందుకు ఒక సింగర్ ను ఐదు సంవత్సరాలుగా నిషేధానికి గురైంది.
ఈ సంఘటన వారి కళ్ళముందే జరుగుతున్నప్పటికీ కేవలం ఆ రచయితతో పరిచయమున్న కారణంగా ఎవ్వరూ నోరు విప్పలేదు. తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలను పట్టించుకోకుండా మాట్లాడే రాజకీయ నాయకులను ఎలా నమ్మాలి అంటూ ఈ సందర్భంగా కమల్ హాసన్ చేసిన ట్వీట్ కి సింగర్ చిన్మయి రిప్లై ఇస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.