పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ ని పోలీసులు అరెస్టు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఇతని హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు నమోదైన సంగతి తెలిసిందే. పాటియాలా కోర్టు లో దీని పై విచారణ జరిగింది. 2 సంవత్సరాల పాటు అతనికి జైలు శిక్ష ను అమలు చేస్తూ ఆదేశాలు తీసుకుంది. 2003 లో ఇతనిపై అభియోగాలు, పిటిషన్లు దాఖలు కాగా 19 ఏళ్ల తర్వాత తీర్పు రావడం గమనార్హం.
ఈ కేసులో దలేర్‌తో పాటు అతని సోదరుడు షంషేర్ కూడా నిందితుడు కాబట్టి అతనికి కూడా శిక్ష పడింది. కానీ అతను అనారోగ్య కారణాల వల్ల మరణించిన సంగతి తెలిసిందే.అమెరికాలో ఈ బ్రదర్స్ పై 2003 ఆ టైంలో 31 కేసులు నమోదయ్యాయి.కొంతమంది చిన్నపిల్లలను, అనాథలైన పెద్ద వారిని విదేశాలకు పంపించి పెద్ద మొత్తంలో వీరు డబ్బులు వసూల్ చేసేవారని రుజువైంది. ఇక దలేర్ మెహందీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.!
2007 లో ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘యమదొంగ’ లో ‘రబ్బరు గాజులు’, 2009 లో రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్ ‘మగధీర’ లో ‘జోర్సే బార్సే’,2013 లో ఎన్టీఆర్- శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘బాద్ షా’ లో బంతి పూల జానకి,
2017 లో బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘పైసా వసూల్’ లో ‘వసూలు వసూలు’, 2018 లో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ లో ‘రెడ్డి ఇక్కడ సూడు’… పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను అలరించాడు.