Kaala Bhairava: ఫాన్స్ దెబ్బకు దిగివచ్చిన కాలభైరవ… కావాలని చేయలేదంటూ క్లారిటీ!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవ గొప్ప సింగర్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ పాట ఆస్కార్ అవార్డు అందుకోవడమే కాకుండా ఈ పాట పాడినటువంటి రాహుల్ కాలభైరవ ఇద్దరు కూడా ఆస్కార్ వేదికపై ఈ పాటను లైవ్ లో పాడారు.అయితే ఈ పాటను ఇలా ఆస్కార్ వేదికపై పాడే అవకాశం తనకు కల్పించినందుకు ఈయన సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇలా నాటు నాటు పాట ఆస్కార్ వంటి ఒక గొప్ప వేదికపై పాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే తనకు ఈ అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ రాజమౌళి నాన్న కీరవాణి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, అమ్మ పెద్దమ్మ కార్తీక్ అన్నయ్య కారణం. వీరి సపోర్ట్ వల్లే నేను ఈ పాట పాడగలిగాను అంటూ వీరి పేర్లను తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ రామ్ చరణ్ పేర్లను మర్చిపోయారు.

ఇలా ఆయన చేసిన పోస్టులో ఎన్టీఆర్ రామ్ చరణ్ పేర్లను ప్రస్తావించకపోవడంతో అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పాట ఇలాంటి మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా కారణమని వాళ్లు డాన్స్ చేయకపోతే ఈ పాటకు అంత ఆదరణ వచ్చేది కాదు అంటూ మండిపడుతూ కాలభైరవను ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ చరణ్ అభిమానులు తనని ట్రోల్ చేయడంతో ఈ విషయంపై కాలభైరవ స్పందించారు.

ఈ సందర్భంగా కాలభైరవ స్పందిస్తూ ఈ పాట ఇంత మంచి ఆదరణ సంపాదించుకోవడానికి ఎన్టీఆర్ చరణ్ అన్నల డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా కారణమని చెప్పడంలో సందేహం అవసరం లేదు.అయితే తాను ఈ పాటను ఆస్కార్ వేదికపై పాడే అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు తెలిపానని, అయితే ఇది మరోలా కన్వే అయింది అంటూ ఈయన తెలిపారు.తాను ఉద్దేశపూర్వకంగా వారిని కించపరచాలన్న ఉద్దేశంతో ఇలాంటి పోస్ట్ చేయలేదని ఒకవేళ అభిమానులు కనుక తప్పుగా భావించి ఉంటే క్షమించండి అంటూ క్షమాపణలు తెలియజేశారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus