Jeethu Joseph: మూడో ‘దృశ్యం’ కథ.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు జీతూ జోసెఫ్‌

ఓ సినిమా మన దేశంలోని అన్ని ప్రముఖ భాషల సినిమా పరిశ్రమల్లో రీమేక్‌ అయింది అంటే ఎంత గ్రేటో కదా. అలాంటి అచీవ్‌మెంట్‌ అందుకున్న చిత్రం ‘దృశ్యం’ (Drishyam) . అంతటి బలమైన కథను రాసింది, తీసింది దర్శకుడు జీతూ జోసెఫ్‌ (Jeethu Joseph) . ఒకసారి కాదు.. ఆ సినిమా రెండు పార్టులూ ఈ ఘనతను సాధించాయి. దీంతో మూడో ‘దృశ్యం’ గురించి భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

Jeethu Joseph

పైన చెప్పినట్లు మలయాళంలో మొదలై.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఘనవిజయం సాధించిన సినిమా ‘దృశ్యం’. హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఇంగ్లిష్‌, స్పానిష్‌లో రీమేక్‌ చేస్తోంది. అలా హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న మొదటి భారతీయ సినిమాగా ‘దృశ్యం’ రికార్డు సొంతం చేసుకుంది. ఇక ఇప్పటివరకు రెండు భాగాలు రాగా.. రెండూ ప్రజాదరణ పొదాయి. దీని మూడో భాగం జీతూ జోసెఫ్‌ కథను సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఈ క్రమంలో రెండో భాగంలో ఎదురైన ఇబ్బందులు, మూడో భాగంలో ఎదురుకాకుండా చూసుకుంటున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోహన్‌లాల్‌తో ఓ దఫా చర్చలు కూడా జరిగాయట. ‘దృశ్యం’ తర్వాత రెండో పార్టు కోసం ముందుగా ఏమీ అనుకోలేదు. అందుకే ‘దృశ్యం 2’ సినిమాకు సమయం పట్టింది. మూడో పార్టు కోసం ముందుగానే అనుకున్నాం. ఇప్పుడు ఆ పనుల మీదే ఉన్నామని జీతూ జోసెఫ్‌ తెలిపారు.

సినిమాను ఎలా ముగించాలి అనే విషయంలో జీతూ జోసెఫ్‌ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారట. కానీ మూడో భాగం కథను ఎక్కడ నుండి మొదలుపెట్టాలో అర్థం కావట్లేదని అంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రముఖ గాయని చిత్రను కలిశాక ‘దృశ్యం 3’ ఓపెనింగ్‌ సీన్స్‌పై ఓ ఆలోచన వచ్చింది అని చెపపారు. సినిమాను ఎలా ప్రారంభించాలి అనే విషయంలో ఆమె ఐడియా చెప్పారు అని జీతూ జోసెఫ్‌ తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయిలో సినిమా ప్రారంభించే అవకాశం ఉంది.

ఆ రాష్ట్రంలో చైతన్య శోభిత పెళ్లి.. పెళ్లి వేదిక ఫిక్స్ అయినట్లేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus