Revanth Engagement Photos: సింగర్ రేవంత్ ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..!
- December 29, 2021 / 05:09 PM ISTByFilmy Focus
‘ఇండియన్ ఐడల్- 9’ టైటిల్ విజేత మరియు ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ అయిన రేవంత్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇతని పూర్తి పేరు.. లోల వెంకట రేవంత్ కుమార్ శర్మ. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకి చెందిన వ్యక్తి ఇతను. విశాఖపట్నంలోని డాక్టర్. వి.ఎస్.కృష్ణా గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసాడు. మరోపక్క ఇతనికి సంగీతం అంటే బాగా ఇష్టం. అందుకోసమే పలు మ్యూజిక్ కాంపీటీషన్స్‌లో పాల్గొని విన్నర్ గా కూడా నిలిచాడు.
ఇదే క్రమంలో అతను ఇండియన్ ఐడల్-9 టైటిల్ గెలిచి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. రేవంత్ ఇప్పటివరకు 200కి పైగా పాటలు పాడాడు. ‘బాహుబలి’ చిత్రంలో ‘మనోహరి’ అనే పాట ఇతని ఇమేజ్ ను మరింత పెంచింది. తెలుగుతో పాటు కన్నడంలో కూడా మంచి ప్లే బ్యాక్ సింగర్‌గా రాణించాడు రేవంత్. ఇక అసలు మేటర్ కు వస్తే ఇతను త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి… వైవాహిక జీవితంలోకి ఎంటర్ కాబోతున్నాడు.
అన్విత అనే అమ్మాయితో రేవంత్ నిశ్చితార్థం ఆదివారం నాడు జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!











