శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా ‘నిను వీడని నీడను నేనే’ (Ninu Veedani Needanu Nene) ‘నేనే నా’ ఫేమ్ కార్తీక్ రాజు (Caarthick Raju) దర్శకత్వంలో రూపొందిన కామెడీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘సింగిల్'(#Single). అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu), విద్యా కొప్పినీడి(Koppineedi Vidya) ఈ సినిమాను నిర్మించారు. చాలా ఏరియాల్లో ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ ఓన్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. మే 9న రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వెన్నెల కిషోర్ (Vennela Kishore), శ్రీవిష్ణు..ల కామెడీ వర్కౌట్ అయ్యింది అని అంతా చెప్పుకొచ్చారు.
#Single Collections:
మొదటి రోజు ఎలా ఉన్నా 2వ రోజు నుండి బాగా పికప్ అయ్యింది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. రెండో వీకెండ్ కూడా సినిమాలు లేకపోవడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘సింగిల్’ (#Single) సినిమా రూ.6.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 10 రోజుల్లో ఈ సినిమా రూ.8.12 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ.12.66 కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా మొత్తంగా రూ.1.52 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించింది.