శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా ‘సింగిల్’ (#Single) అనే సినిమా రూపొందింది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరవాలేదనిపించే టాక్ తెచ్చుకుంది. వెన్నెల కిషోర్ (Vennela Kishore) , శ్రీవిష్ణు..ల కామెడీ వర్కౌట్ అయ్యింది అని అంతా కొనియాడారు. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu), విద్యా కొప్పినీడి(Koppineedi Vidya) ఈ సినిమాను నిర్మించారు. సినిమాని చాలా ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ ఓన్ రిలీజ్ చేసుకుంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో.. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి.
‘సింగిల్’ (#Single) సినిమా రూ.6.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి రోజు రూ.1.57 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ చిత్రం. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ.2.46 కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పాలి. అయితే బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.5.03 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.