Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Reviews » Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 9, 2025 / 06:04 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కిషోర్ కుమార్ (Hero)
  • శ్రద్ధ శ్రీనాథ్ (Heroine)
  • ఆర్య లక్ష్మి, అస్మాల్, హరి, మిథున్, ఇనియన్ సుబ్రమణి తదితరులు.. (Cast)
  • ప్రమోద్ సుందర్ (Director)
  • కె.ఎస్.రామకృష్ణ (Producer)
  • డాన్ విన్సెంట్ (Music)
  • కె.రామ్ చరణ్ (Cinematography)
  • Release Date : మే 09, 2025
  • ఆర్.కె.ఇంటర్నేషనల్ (Banner)

శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath), కిషోర్ కుమార్ (Kishore Kumar) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కలియుగం 2064’ (Kaliyugam 2064). సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన మూవీ ఇది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రానా వంటి స్టార్స్ ఈ ట్రైలర్ ను కాన్సెప్ట్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు వేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. దీంతో సినిమా పై ఆడియన్స్ దృష్టి పడింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారి అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం రండి :

Kaliyugam 2064 Review in Telugu:

Kaliyugam 2064 Movie Review and Rating

కథ: అది 2064 సంవత్సరం.. ప్రపంచం మొత్తం నాశనం అయిపోయి డబ్బున్నోళ్లు రెసిడెంట్స్ గా ఒక నగరాన్ని నిర్మించుకొని సుఖంగా బ్రతుకుతుండగా.. డబ్బులేని వాళ్లు మాత్రం ఆకలికి తట్టుకోలేక, ఆరోగ్యంగా బ్రతకలేక లిబరేటర్స్ గా నానా ఇబ్బందులు పడుతుంటారు.

రెసిడెంట్స్ దగ్గరకి చేరుకొనే ప్రయాణంలో అనుకోకుండా భూమి (శ్రద్ధ శ్రీనాథ్) ప్రాణాలు కాపాడుకునే క్రమంలో థామస్ (ఇనియన్ సుబ్రమణి) (Iniyan Subramani) దగ్గర ఇరుక్కుంటుంది.

ఆమెకు మంచి బట్టలు ఇవ్వడమే కాక, రోజు కడుపు నిండా తిండి పెడుతుండే థామస్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి భూమికి. అసలు థామస్ ఎవరు? భూమిని ఎందుకని బంధించి పెడతాడు. అక్కడి నుంచి భూమి ఎలా తప్పించుకుంది? అనేది “కలియుగం 2064” కథాంశం.

Kaliyugam 2064 Movie Review and Rating

నటీనటుల పనితీరు: శ్రద్ధ శ్రీనాథ్ ను ఇప్పటివరకు ఈ తరహా పాత్రలో చూసి ఉండకపోవడంతో.. ఆమె నటన చాలా కొత్తగా కనిపిస్తుంది. అదే విధంగా.. ఆమె పాత్ర భవిష్యత్ మనిషి మనస్తత్వానికి అద్దం పడుతుంది.

ఇక థామస్ పాత్రతో ఒక రియాలిటీ చెక్ ఇచ్చాడు దర్శకుడు. ఇనియన్ సుబ్రమణి కూడా ఆ పాత్రలో అంతే క్రూరంగా కనిపించాడు. అతడి పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందో, అంతే నిజాయితీగా కూడా ఉంటుంది. మొదట్లో ఆ పాత్ర ఎంత భయపెడుతుందో, చివరికి వచ్చేసరికి అంతే స్థాయిలో ఆలోచింపజేస్తుంది.

సినిమా మొత్తం నడిచేది కిషోర్ కుమార్ నరేషన్ లోనే. అయితే అతని పాత్ర ఇంకాస్త ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది.

Kaliyugam 2064 Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ప్రమోద్ సుందర్ (Pramodh Sundar) ఆలోచనాధోరణిని కచ్చితంగా మెచ్చుకోవాలి. మనిషి మానవత్వంతో వ్యవహరించాలి కానీ, మృగంలా కాదు అనే మెసేజ్ ను ఇవ్వడంలో కచ్చితంగా సక్సెస్ అయ్యాడు. అయితే.. అతడి ఆలోచనను తెరపై చూపించడంలో మాత్రం తడబడ్డాడు.

ఈ సినిమాకి మెయిన్ హీరోస్ సినిమాటోగ్రాఫర్ కె.రామ్ చరణ్ (K Ramcharan) & ఆర్ట్ డైరెక్టర్ శక్తీ వెంకట్రాజ్. 2064 టైంలైన్ ను, థామస్ ఇంటిని క్రియేట్ చేసిన విధానం బాగుంది. అలాగే ఆర్జీబీ లైటింగ్ తోనే రకరకాల ఎమోషన్స్ ను ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది.

ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంది. సీజీ వర్క్ వర్క్ కూడా పర్వాలేదు. అయితే ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది.

Kaliyugam 2064 Movie Review and Rating

విశ్లేషణ: కొన్ని కథలు ఆలోచన వరకు చాలా బాగుంటాయి. “కలియుగం 2064” కూడా ఆ తరహా చిత్రమే. చాలా ఆలోచనలున్నాయి, చాలా ఆశయాలున్నాయి. అయితే దర్శకుడు స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. ఇప్పటికైతే ‘కలియుగం 2064’ గొప్ప ఆశయం కలిగిన అబౌవ్ యావరేజ్ సినిమాగా నిలిచింది. హై టెక్నికల్ వాల్యూస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు.

Kaliyugam 2064 Movie Review and Rating

ఫోకస్ పాయింట్: విజన్ మంచిదే

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaliyugam 2064
  • #Kishore Kumar G
  • #Pramodh Sundar
  • #Shraddha Rama Srinath

Reviews

3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: గుర్రం పాపిరెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: గుర్రం పాపిరెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

RGV : శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించిన ఆర్జీవీ..!

RGV : శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించిన ఆర్జీవీ..!

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Champion : ఛాంపియన్ బ్యూటీ ‘అనశ్వర రాజన్’ అందానికి కారణం అదేనా..!

Champion : ఛాంపియన్ బ్యూటీ ‘అనశ్వర రాజన్’ అందానికి కారణం అదేనా..!

ఏందీ స్క్రీన్‌ల డిస్కషన్‌.. మన దగ్గర ఎన్ని రకాల స్క్రీన్‌లు ఉన్నాయి.. వాటి లెక్కేంటో తెలుసా?

ఏందీ స్క్రీన్‌ల డిస్కషన్‌.. మన దగ్గర ఎన్ని రకాల స్క్రీన్‌లు ఉన్నాయి.. వాటి లెక్కేంటో తెలుసా?

trending news

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 hours ago
Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

2 hours ago
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

2 hours ago
Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

4 hours ago
Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

6 hours ago

latest news

Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్‌..  హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?

Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్‌.. హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?

5 hours ago
Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

5 hours ago
Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

5 hours ago
Nandi Awards: తెలుగు పండగకి తెలుగు సినిమాకు అవార్డులు.. ఏపీ ప్రభుత్వం రెడీనా?

Nandi Awards: తెలుగు పండగకి తెలుగు సినిమాకు అవార్డులు.. ఏపీ ప్రభుత్వం రెడీనా?

5 hours ago
Geetha Arts: అల్లు అరవింద్ పెద్ద సినిమా ఎవరితో? చర్చల్లోకి ఇద్దరు అగ్ర హీరోల పేర్లు!

Geetha Arts: అల్లు అరవింద్ పెద్ద సినిమా ఎవరితో? చర్చల్లోకి ఇద్దరు అగ్ర హీరోల పేర్లు!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version