శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా కార్తీక్ రాజు (Caarthick Raju) దర్శకత్వంలో వచ్చిన ‘సింగిల్’ (#Single) మే 9న రిలీజ్ అయ్యింది. వెన్నెల కిషోర్(Vennela Kishore), శ్రీవిష్ణు..ల కామెడీ వర్కౌట్ అయ్యింది అని అంతా చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu), విద్యా కొప్పినీడి(Koppineedi Vidya) ఈ సినిమాను నిర్మించారు. చాలా ఏరియాల్లో ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ ఓన్ రిలీజ్ చేసుకుంది. అందువల్ల బయ్యర్స్ పై ఎక్కువ భారం పడలేదు. అయితే సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. రెండో వీకెండ్ కు సినిమాలు లేకపోవడం వల్ల మాస్ ఏరియాల్లో ఈ సినిమాని బాగానే చూస్తున్నారు. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.98 cr |
సీడెడ్ | 0.53 cr |
ఉత్తరాంధ్ర | 0.68 cr |
ఈస్ట్ | 0.25 cr |
వెస్ట్ | 0.19 cr |
గుంటూరు | 0.49 cr |
కృష్ణా | 0.45 cr |
నెల్లూరు | 0.17 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 5.74 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
1.92 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 7.66 cr (షేర్) |
‘సింగిల్’ సినిమా రూ.6.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 9 రోజుల్లో ఈ సినిమా రూ.7.66 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ.11.91 కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా మొత్తంగా రూ.1.06 కోట్ల లాభాలను అందించింది.