Bigg Boss 5 Telugu: సిరితో ఆవిషయంలో షణ్ముక్ భయపడుతున్నాడా..?

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముక్ అండ్ సిరిల మద్యలో ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఫస్ట్ నుంచీ కూడా వీరిద్దరూ జట్టుగానే ఉన్నారు. వీరితో జెస్సీ కూడా చేరడంతో త్రిముర్తులుగా మారారు. మోజ్ రూమ్ బ్యాచ్ గా , కార్నర్ బ్యాచ్ గా అయ్యారు ఈ ముగ్గురు. తమదైన స్టైల్లో గేమ్ ఆడుతూ ప్రతివారం సేఫ్ అవుతూ వచ్చారు. అయితే, ఈవారం డేంజర్ జోన్ లో సిరి ఉందని ముందుగానే గ్రహించినట్లుగా ఉంది. షణ్ముక్ కూడా అందరూ ఫిమేల్ కంటెస్టెంట్స్ వెళ్లిపోతున్నారని సిరికి చెప్పాడు. ఇక అర్ధరాత్రి సిరి అండ్ షణ్ముక్ ఇద్దరి బెడ్ దగ్గరకి వచ్చిన రవి కాసేపు ఫన్ చేశాడు.

త్రిముర్తులలో బ్రహ్మ అంటూ షణ్ముక్ ని ఆటపట్టించాడు. షన్నూకి, సిరికి కాలికి దండం పెడుతూ ఫన్ చేశాడు. ఆ తర్వాత మార్నింగ్ మోజ్ రూమ్ లో కూర్చున్న షణ్ముక్ కి సిరి సడెన్ గా ఫోర్ హెడ్ పైన ముద్దు పెట్టింది. ఏమీ మాట్లాడకుండా బెడ్ రూమ్ లో ఉన్న రవి అండ్ టీమ్ దగ్గరకి వెళ్లిపోయింది. దీంతో షాకైన షణ్ముక్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ, సిగ్గుపడుతూ సిరివైపు చూస్తున్నాడు. ఇక రవి అండ్ బ్యాచ్ సిరిని వదిలి ఉండలేకపోతున్నాడు అంటూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. షణ్ముక్ కెమెరావైపు చూస్తూ బాగా క్యాప్చర్ చేసావా.. క్లియర్ గా .. అంటూ సణిగాడు. ఆ తర్వాత సిరి మోజ్ రూమ్ లోకి వచ్చి నీవల్లే నేను డిస్టర్బ్ అయిపోతున్నాను.

నేను నీతో ఉంటే ఏమైనా ప్రాబ్లమా నీకు అంటూ అడిగింది. అలా అయితే డైరెక్ట్ గా చెప్తాను కదా అంటూ షణ్ముక్ బదులు ఇచ్చాడు. అంతేకాదు, నావల్ల నీకు ఇరిటేషన్ అనిపిస్తే నాకు దూరంగా ఉండు. నేనేం ఫీల్ అవ్వను అంటూ సిరికి చురకలు వేశాడు. సిరి మరోసారి షణ్ముక్ పై అలిగి అక్కడ్నుంచీ వెళ్లిపోయింది. వీరిద్దరి అలకలతో బిగ్ బాస్ సీజన్ 5 అయిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు సిరి చేస్తున్న పనులకి షణ్ముక్ సిరిని దూరం పెడుతున్నాడు. గేమ్ లో కూడా దూరం పెడుతున్నాడు. అనీమాస్టర్ అన్నమాటలకి వెళ్లి సిరి నేను కావాలని కెప్టెన్సీ టాస్క్ ని ప్లాన్ చేయలేదంటూ చెప్పాడు. ఇది రాంగ్ గా ఆడియన్స్ ఎక్కడ తీస్కుంటారో అన్న విషయంలో సిరితో ఉంటున్న షణ్ముక్ భయపడుతున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 5లో ఈ ముగ్గురి ఫ్రెండ్షిప్ ఎంత దూరం వెళ్తుందనేది చూడాలి. అదీ మేటర్.

[yop_poll id=”4″]

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus