Siri,Shanmukh: సిరి మదర్ ఇచ్చిన షాక్ కి షణ్ముక్ డల్ అయ్యాడా..?

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి పీక్స్ కి వెళ్లాయి. ప్రతి ఒక్కరి హౌస్ మేట్ నుంచీ వచ్చిన ఫ్యామీలీ మెంబర్స్ వాళ్లతో మాట్లాడతూ వాళ్ల గేమ్ ని ఎనలైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడే ఫస్ట్ పింకీ ఫ్రెండ్ మధు వచ్చింది. మధు వచ్చి రాగానే పింకీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. డాడీ రాలేదా.. డాడీ వస్తారని అనుకున్నాను అని ఆశగా అడిగింది పింకీ. మధు తన గేమ్ గురించి చెప్తూనే సన్నీ అంటే నాకు ఇష్టమని పెద్ద ఫ్యాన్ అని చెప్పింది. ఆ తర్వాత వచ్చిన రవి ఫ్యామిలీ ఎపిసోడ్ కే హైలెట్ అని చెప్పాలి. ఫస్ట్ ఫ్రీజ్ గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చిన నిత్యాని చూసి రవి వియా రాలేదా అని అడిగాడు. దీంతో కాసేపు రాలేదని నమ్మించింది.

ఇక చేసేది ఏమీ లేక, బెడ్ రూమ్ లో కూర్చుని నిత్యతో మాట్లాడుతుంటే., పాపా ఐలవ్ యూ అనే వాయిస్ వినిపించింది. దీంతో ఒక్కసారిగా రవి ఎమోషనల్ అయిపోయాడు. పాప వియాతో చాలాసేపు హౌస్ లో సందడి చేసాడు. దీని తర్వాత షణ్ముక్ వాళ్ల మదర్ ఉమారాణి వచ్చినప్పటినుంచీ అసలు కథ మొదలైంది. అంతకు ముందు వచ్చిన సిరి మదర్ ఇలాగా చెప్పందని చెప్పుకుని బాధపడ్డాడు షణ్ముక్. అసలు నువ్వు నీ గేమ్ ఆడు ఇక్కడ అందరూ గేమ్ ఆడటానికే కదా వచ్చారు అని చెప్పింది. ఎవరు అలిగినా వెళ్లి ఎందుకు బ్రతిమిలాడుతున్నావ్ అంటూ ఇండైరెక్ట్ గా సిరి గురించి చెప్పింది. ఇక కెమెరా ముందుకు వచ్చి డ్యాన్స్ చేయి అని చెప్పింది. షణ్ముక్ అందరు పేరెంట్స్ వచ్చారు. కొన్ని హింట్స్ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు.

పర్టిక్యులర్ గా ఒక మూలకి వెళ్లి అలా ఉండద్దని అందరితోనూ కలవాలి అంటూ చెప్పింది. ఇక్కడే దీపుని కలిశావా అని షణ్ముక్ అడిగితే, కలిశాను అంతా బాగానే ఉంది గేమ్ ఫాలో అవుతుందని చెప్పింది. అంతేకాదు, దీపు బాగానే ఉంది 100 పర్సెంట్ అని చెప్పింది. ఒట్టు వేయమని చెప్తే, నేను అలా అర్ధం చేస్కుంటానో, తను కూడా అలాగే అర్ధం చేస్కుంటుంది అంటూ చెప్పింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో సందడి చేసింది. అయితే, ఆ తర్వాత పర్సనల్ గా మోజ్ రూమ్ లో కూర్చుని కాసేపు బుద్దులు చెప్పింది. ఇంట్లో ఎలాగున్నావో అలాగే ఉన్నావని చెప్తోంది. ఇక సిరి వాళ్ల మదర్ వచ్చి కొన్ని నాకు నచ్చట్లేదు అని చెప్పారు అంటే, నాకు అర్ధమవుతోంది. ఫ్రెండ్షిప్ కదా అంటూ మాట్లాడింది.

ఎక్కువ ఆలోచించకు, నువ్వు దేనికి వచ్చావో అదే నీ గేమ్ అంటూ చెప్పారు. అలాగే, ఎమోషనల్ గా వెళ్లడం, ఎవరు అలిగినా కూడా వెళ్లి బ్రతిమిలాడటం అనేది బాలేదని చెప్పారు. అందరితోనూ ఉండు, చక్కగా ఫ్రెండ్స్ చూడు ఎలా ఉన్నారో అంటూ బాగా ఎంజాయ్ చేయి అంటూ మాట్లాడారు. గేమ్ ని గేమ్ లా చూడండి, ఎమోషనల్ అయిపోకండి అంటూ చెప్పారు. అలాగే, ఎక్కువ అలగకండి బాగోలేదు అంటూ చెప్పారు. దీంతో సిరి ఇంకా షణ్ముక్ ఇక నుంచీ చూస్తారు మేమంటే ఏంటో అంటూ చెప్పుకొచ్చారు. సిరి మదర్ , అలాగే షణ్ముక్ మదర్ కూడా ఇదే పాయింట్స్ చెప్పారు.

దీంతో వాళ్లిద్దరికీ గేమ్ ఎక్కడ దెబ్బకొట్టిందా అని ఆలోచనలో పడ్డారు. అంతేకాదు, మార్నింగ్ నిద్రలేవగానే షణ్ముక్ సిరితో నేను తండ్రిలాగా, అన్నయ్యలాగా ఉండి ఎడ్వాంటేజ్ తీస్కోవడం లేదని మీ అమ్మగారికి చెప్పు అంటూ సిరిపై కాస్త సీరియస్ అయ్యాడు. దీంతో సిరి కాసేపు మాట్లాడకుండా ఉండిపోయింది. నాగార్జున క్లాస్ పీకినప్పటి నుంచీ సిరి, షణ్ముక్ లు పూర్తిగా మారిపోతారనే అనుకున్నారు. కానీ మళ్లీ తిట్టుకోవడం, అలగడం, మళ్లీ వచ్చి హగ్స్ ఇచ్చుకోవడం చేస్తునే ఉన్నారు. అసలు వీళ్లిద్దరి మద్యలో ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు బిగ్ బాస్ వ్యూవర్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. అదీ మేటర్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.