Siri: ఆ అవకాశం వచ్చినా వదులుకున్నా బిగ్ బాస్ గురించి ఓపెన్ అయిన సిరి

యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని పలు వెబ్ సిరీస్ లలో, సీరియల్స్ లో నటించి సందడి చేసిన సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇదివరకే పలు సీరియల్స్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా వచ్చింది.బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్ళిన ఈమె టాప్ ఫైవ్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఈమె చేసిన రచ్చ మామూలుగా లేదు.

ఇకపోతే ఈ కార్యక్రమం తర్వాత సిరి ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేసింది. హిందీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అడల్టింగ్‌ అనే వెబ్ సిరీస్ ను రీమేక్ చేస్తూ తెలుగులో ‘బీఎఫ్‌ఎఫ్‌’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ గురించి సిరి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ.. తాను చదువు మధ్యలో ఆపేసి హైదరాబాద్ వచ్చి కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా చేశానని తెలిపారు.

అనంతరం పలు టీవీ సీరియల్స్ లో నటించానని అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను చేస్తూ మంచి అభిమానులను సంపాదించుకున్నానని ఈ సందర్భంగా సిరి వెల్లడించారు. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ అడల్టింగ్‌ అనే పేరు ఉన్నప్పటికీ ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదని తెలిపారు. ఇద్దరు మెచ్యూర్డ్‌ గాళ్స్‌ తమ లైఫ్‌ని ఎలా లీడ్‌ చేస్తారన్నది కథ.

ఇక పోతే తాను బిగ్ బాస్ సీజన్ లో పాల్గొని ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నానని ఈమె వెల్లడించారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, కేవలం ప్రేక్షకుల సపోర్ట్ కారణంగానే తాను ఫైనల్ వరకు వెళ్లానని, తనకు బిగ్ బాస్ ఓటీటీలో కూడా అవకాశం వచ్చిందని, అయితే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు కారణంగా తానే ఆ అవకాశాన్ని వదులుకున్నానని సిరి వెల్లడించారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.