Bigg Boss 5 Telugu: ఇద్దరి మద్యలో అసలు గొడవేంటో తెలుసా..?

  • November 2, 2021 / 01:29 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స అనేవి హైలెట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా సన్నీకి సిరికి మద్యన జరిగిన ఆర్గ్యూమెంట్ మంచి కిక్ ఇచ్చింది. ఫస్ట్ సిరి సన్నీని నామినేట్ చేస్తూ జెస్సీ ఇష్యూని తీస్కుని వచ్చింది. జెస్సీకి నిజంగానే హెల్త్ బాగోలేదని, దాన్ని నువ్వు వర్టిగోనా. వర్టిగోనా అంటూ మాట్లాడటం నాకు నచ్చలేదంటూ చెప్పింది. ఈవిషయంలో తిరిగి సిరిని నామినేట్ చేసిన సన్నీ నిజంగా అది అంత సీరియల్ ప్రాబ్లమ్ అని నాకు తెలీదని లేదంటే అస్సలు కామెంట్ చేయను కదా అంటూ క్లారిఫికేషన్ ఇచ్చాడు. తెలుసుకోవాలి బ్రో అంటూ పక్కన్ ఉన్న షణ్ముక్ వత్తాసు పలికాడు. ఇద్దరి మద్యలో ఈ విషయంపై పెద్ద వాగ్వివాదం జరిగింది.

నిజానికి ఎపిసోడ్ స్టార్టింగ్ లో జెస్సీ వాంటింగ్ చేసుకుంటుంటే సన్నీ జాలిపడ్డాడు. పాపంరా వాడు అటూ ఇటూ తిరుగుతున్నాడు చూడలేకపోతున్నా అంటూ చెప్పాడు. అయితే, ఇక్కడే జెస్సీ బెడ్ పైన బాధపడుతుంటే షణ్ముక్ అండ్ సిరి ఇద్దరూ అస్సలు పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్లు చేస్కున్నారు. సిరి నిద్ర పోతుంటే, షణ్ముక్ తన గిప్ట్ ని చూస్కుంటూ ఉన్నాడు. వీరిద్దరూ జెస్సీని ఏమాత్రం పట్టించుకోవడం లేదని సన్నీ మాట్లాడుతుంటే, వాళ్లు బాగానే చూస్కుంటారు లే.. నువ్వు మద్యలోకి వెళ్లకు అంటూ మానస్ సన్నీని హెచ్చరించాడు. నిజానికి జెస్సీ పక్కనే ఉన్న షణ్ముక్ జెస్సీని చూసాడే కానీ, ఏమైంది అని ఆరాతీయలేదు. సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అయినప్పటి నుంచీ జెస్సీని సిరి, షణ్నూ దూరం పెడుతున్నారని మానస్ అన్నాడు.

ఆ తర్వాత నామినేషన్స్ పూర్తి కాగానే సిరి మరోసారి సన్నీని ఎందుకు నామినేట్ చేసిందో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇదే ఆర్గ్యూమంట్ కి దారితీసింది. హైలెట్ అవ్వాలని ఇలా చేసిందని మానస్ తో సన్నీ అంటుంటే పక్కనే సిరి ఈమాటలు విని సన్నీని హెచ్చరించింది. హైలెట్ అవ్వాలని ఎవ్వడూ చేయలేదని, నోరింది కదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చింది. నిజానికి సన్నీ జెస్సీ హెల్త్ ఇష్యూని నమ్మాను అని చెప్పినా కూడా జెస్సీ పైకి గాల్లోకి ఎగిరి ఎంత యాక్టివ్ గా ఉన్నానో చూడు అంటూ చూపించాడు. వర్టిగో అంటే ఇలాగే ఉంటుందని, దానికి దీనికి అస్సలు సంబంధం ఉండదని నిరూపించే ప్రయత్నం చేశాడు. దీనివల్లే సన్నీ అండ్ సిరికి ఇంకా హీటెడ్ ఆర్గ్యూమెంటే అనేది జరిగింది. మచ్చా.. మచ్చా.. అంటూ ఇద్దరూ ఒక రేంజ్ లో ఆర్గ్యూ చేసుకున్నారు. అదీ మేటర్.

[yop_poll id=”5″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus