Sitara, Mahesh Babu: సెటైర్లు, పంచ్ లలో మహేష్ ను సితార మించిపోయిందా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారనే సంగతి తెలిసిందే. సోమవారం నుంచి మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఒకవైపు సినిమాలతో మరోవైపు యాడ్స్ తో ప్రిన్స్ మహేష్ బాబు కళ్లు చెదిరే రేంజ్ లో సంపాదిస్తున్నారనే సంగతి తెలిసిందే. పలు టీవీ షోలలో పాల్గొంటూ మహేష్ బాబు టీవీ షోల ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. సాధారణంగా మహేష్ బాబు సైలెంట్ గా ఉంటారు. అయితే మహేష్ బాబు వేసే పంచ్ లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చాలామంది కామెంట్లు చేస్తారనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు, సితార డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్ కు ప్రతి వారం హాజరవుతుండగా ఈ షో తాజా ఎపిసోడ్ లో సితార పిల్లి గిన్నెలో వేడివేడి పాలు తాగితే ఏమవుతుందని ప్రశ్న వేశారు.

ఆ ప్రశ్నకు కొంత సమయం పాటు ఆలోచించిన మహేష్ పిల్లి మూతి కాలిపోతుందని చెప్పగా సమాధానం కరెక్ట్ కాదని సితార చెబుతుంది. మరి ఏమవుతుందని అడగగా బౌల్ ఖాళీ అయిపోతుందంటూ సితార పంచ్ వేశారు. సితార చెప్పిన జవాబు భలే పేలడంతో పాటు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. సితార చాలా టాలెంటెడ్ అని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.

సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారని చాలామంది భావిస్తున్నారు. చిన్న వయస్సులో సితార తన ప్రతిభతో అభిమానులకు మరింత దగ్గరవుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. సెటైర్లు, పంచ్ లలో మహేష్ ను సితార మించిపోయిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus