Devara: దేవర హిట్టైతే సితార నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  కొరటాల శివ (Koratala Siva) కాంబో మూవీ దేవర  (Devara)  తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు సితార నిర్మాతల సొంతమయ్యాయని చాలా కాలం నుంచి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం నాగవంశీ (Suryadevara Naga Vamsi) ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇందుకు సంబంధించి క్లారిటీ వచ్చింది. గతేడాది లియో సినిమాకు సితార నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు. లియో (LEO) మూవీ సెకండాఫ్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించినా తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గా లియో ఘన విజయం సాధించిందనే చెప్పాలి.

లియో సినిమా సితార నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. దేవర హిట్టైతే సితార నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. దేవర సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. గత కొన్నేళ్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎన్టీఆర్ మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో దేవర సినిమాతో తేలిపోనుంది.

ఈ సినిమా స్క్రిప్ట్ కోసం కొరటాల శివ ఏడాదికి పైగా కష్టపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దేవర పక్కా బ్లాక్ బస్టర్ అని ఎన్టీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో తంగం పాత్రలో కనిపించనుండగా ఆమె కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.

జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ రేంజ్ లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో కూడా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగగా దేవర సినిమా సరికొత్త రికార్ద్స్ బాలీవుడ్ లో కూడా క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మాస్ సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం ఎంతగానో నచ్చుతాయనే సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus