Siva Rajkumar: ఆ హీరోలకు నేను వీరాభిమానిని.. శివరాజ్ కుమార్ కామెంట్స్ వైరల్!

కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ లకు నేను వీరాభిమానినని శివరాజ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు హీరోలు అంటే నాకు ఎంతో ఇష్టమని ఈ హీరోలు నాకు రెండు కళ్లతో సమానమని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు.

కమల్ తన కళ్లతోనే హావభావాలను పలికించగలడని ఆయన చెప్పుకొచ్చారు. అమితాబ్ వాయిస్ తన పాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని శివరాజ్ కుమార్ వెల్లడించారు. అమితాబ్ స్క్రీన్ పై కనిపిస్తే చాలని ఆనందంగా అనిపిస్తుందని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు. అమితాబ్ అగ్నిపథ్ లోని రోల్ ను స్పూర్తిగా తీసుకుని ఘోస్ట్ మూవీలో నా రోల్ ను రాశారని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు. బాడీ లాంగ్వేజ్ విషయంలో అమితాబ్ లా చేయడానికి ప్రయత్నించానని శివరాజ్ కుమార్ (Rajkumar) చెప్పుకొచ్చారు.

పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా మరణించినా ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటాడని అనిపిస్తుందని శివరాజ్ కుమార్ కామెంట్లు చేశారు. దసరా పండుగ కానుకగా రిలీజ్ కావడం వల్ల ఘోస్ట్ మూవీకి కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో సరైన థియేటర్లు దక్కడం లేదు. శివరాజ్ కుమార్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

శివరాజ్ కుమార్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సైతం శివరాజ్ కుమార్ ఆసక్తి చూపుతున్నారు. శివరాజ్ కుమార్ నటిస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. ఈ నటుడి రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus