సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. శ్రియ శరణ్ హీరోయిన్ గా.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘శివాజి’. అప్పటివరకు సౌత్ లో వచ్చిన మూవీస్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రికార్డు సృష్టించింది ‘శివాజి’.ఓ ఎన్నారై ఇండియాలో దాగి ఉన్న బ్లాక్ మనీ ని బయటకు రప్పించి.. ప్రజలకు ఏ విధంగా సాయపడ్డాడు అనే థీమ్ తో ఈ చిత్రం రూపొందింది. 2007 వ సంవత్సరం జూన్ 15న ఈ చిత్రం విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది. తమిళంలో ఈ చిత్రం ఎబౌవ్ యావరేజ్ గా నిలిచినప్పటికీ.. తెలుగులో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
మరి ఈ మూవీ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
4.25 cr
సీడెడ్
3.42 cr
ఉత్తరాంధ్ర
2.65 cr
ఈస్ట్
1.55 cr
వెస్ట్
1.52 cr
గుంటూరు
1.90 cr
కృష్ణా
1.60 cr
నెల్లూరు
0.84 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
17.73 cr
‘శివాజి’ చిత్రానికి తెలుగులో రూ.15.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఓ డబ్బింగ్ చిత్రానికి ఇంత ఎక్కువ బిజినెస్ జరగడం.. అదే మొదటి సారి. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.17.73 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇది కూడా ఓ రికార్డ్ అనే చెప్పాలి. దీంతో బయ్యర్లకు రూ.2.41 కోట్ల లాభాలు అందినట్టు తెలుస్తోంది.