Sivaji, Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి శివాజీ ఊహించని కామెంట్లు..!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అనేక సినిమాల్లో నటించిన శివాజీ (Sivaji).. ఆ తర్వాత హీరోగా మారి అనేక సినిమాల్లో నటించాడు. చిన్న సినిమాలకు స్టార్ అనిపించుకున్నాడు. అతను చేసిన ‘మిస్సమ్మ’ (Missamma) ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కానీ తర్వాత ఎందుకో సినిమాలకి దూరమయ్యాడు. చాలా కాలం తర్వాత అతను ‘బిగ్ బాస్ 7 ‘ లోకి ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.

‘బిగ్ బాస్ 7 ‘ ఇతని సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి బూస్టప్ ఇచ్చింది అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ’90’s ‘ (90’s – A Middle-Class Biopic) వెబ్ సిరీస్ కూడా సక్సెస్ సాధించింది. దీంతో పలు సినిమా వేడుకలకి గెస్ట్..లుగా వెళ్తున్నాడు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇలా మళ్ళీ శివాజీ బిజీగా మారాడు. ఇటీవల శివాజీ  (Ali) అలీతో సరదాగా అనే షోలో పాల్గొన్నాడు. ఇందులో అతను చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శివాజీ మాట్లాడుతూ.. “నేను హీరోగా 60 – 70 సినిమాలు చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ 25 సినిమాలు చేశాను. ఈ ఏడాదిలో 100 పూర్తి చేస్తాననే నమ్మకం కూడా ఉంది. గతంలో ‘మాస్టర్’ (Master)  సినిమాలో నేనొక చిన్న పాత్ర పోషించాను. ఆ సినిమా టైంలో చిరంజీవిగారితో (Chiranjeevi) టీం అందరితో కలిసి శ్రీశైలం నుండి వస్తున్నాము.

అప్పుడు చిరంజీవి గారికి నా గురించి వేణుమాధవ్ (Venu Madhav) … ‘అన్నా .. శివాజీ రూమ్ రెంటు కట్టలేక ఇబ్బంది పడుతున్నాడు .. టెన్షన్ పడుతున్నాడు’ అంటూ చెప్పాడు. అప్పుడు చిరంజీవి గారు ‘అవునా ..’ అంటూ చిరంజీవి గారు వెంటనే రూ.10 వేలు తీసి ఇచ్చారు. ఆ డబ్బులు నాకు 6 ,7 నెలల వరకు వచ్చాయి” అంటూ చెప్పుకొచ్చాడు.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus