Sivaji: బిగ్ బాస్ బజ్ లో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో విజేతగా శివాజీ నిలవాలని చాలామంది భావించారు. బిగ్ బాస్ సీజన్7 ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం వెనుక శివాజీ కృషి ఎంతో మంది. శివాజీ టాప్3 కంటెస్టెంట్ గా నిలవగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. గీతూ రాయల్ శివాజీని ఇంటర్వ్యూ చేయగా బిగ్ బాస్7 విన్నర్ ను నేనేనని శివాజీ తెలిపారు.

గీతూ రాయల్ “ఎక్స్ పెక్ట్ చేశారా.. టాప్3 వరకు వస్తానని” అని అడగగా టాప్3 ఏంటి ఈ సీజన్ విన్నర్ నేనేనని నాకు తెలుసని శివాజీ కామెంట్లు చేశారు. విన్నర్ మీరే అనుకున్నారు కదా టాప్3 లో ఆగిపోవడానికి కారణం ఏంటనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని గీతూ కోరగా ఒక వ్యక్తి పల్లెటూరి నుంచి వచ్చి ఇక్కడ ఆడుతుంటే ఆడనివ్వకుండా చెయ్యాలన్న సంకల్పానికి నేను అడ్డం పడ్డానని శివాజీ పేర్కొన్నారు.

మీ వల్లే యావర్, ప్రశాంత్ ఇంతదూరం వచ్చారని మీరు అనుకుంటున్నారా అనే ప్రశ్నకు కాకపోతే వాళ్ల వెనకాల ఒక శక్తి ఉందని అందరికీ తెలియజేశానని శివాజీ అన్నారు. వాళ్లకు మైండ్ లో లేని ఆలోచనలను క్రియేట్ చేయించారని గీతూ కామెంట్లు చేయగా నీ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నేను రాలేదని ఆయన వెల్లడించారు. అమర్, నేను మంచి ఫ్రెండ్స్ అని శివాజీ పేర్కొన్నారు.

మీరు ఎంతనుకున్నా బయట జనం చూస్తున్నారని స్పై బ్యాచ్ లో ఫేవరిటజం లేదా అనే ప్రశ్నకు శివాజీ జవాబిచ్చారు. ఎవరు కలిసి ఆడుతున్నారో ఆడియన్స్ చూశారని ఆయన అన్నారు. తన మార్క్ ఉండాలని బిగ్ బాస్ షోకు వచ్చానని శివాజీ వెల్లడించారు. ఫుల్ వీడియోలో శివాజీ ఏం చెబుతారో చూడాలి. ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ షో ద్వారా (Sivaji) శివాజీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus