తమిళంలో శంకర్ తర్వాత ఆ రేంజ్లో సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ సినిమాలు చేయడంలో ఏ.ఆర్.మురుగదాస్ (A.R. Murugadoss) దిట్ట. ఆయన మెసేజ్ వంటివి పక్కన పెట్టి కంప్లీట్ కమర్షియల్ సినిమాలు తీసిన రోజులు కూడా ఉన్నాయి. ‘గజినీ’ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ సినిమా తర్వాత మురుగదాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. చిరంజీవితో (Chiranjeevi) చేసిన ‘స్టాలిన్’ (Stalin) , ఆమిర్ ఖాన్ తో (Aamir Khan) చేసిన ‘గజిని’ (Ghajini) , సూర్యతో (Suriya) చేసిన ‘సెవెంత్ సెన్స్’ (7aum Arivu), విజయ్ తో (Vijay Thalapathy) చేసిన ‘తుపాకీ’ (Thuppakki) ‘కత్తి’ (Kaththi) వంటి సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి.
మహేష్ తో (Mahesh Babu) తెలుగులో చేసిన ‘స్పైడర్’ (Spyder) డిజాస్టర్ అయినా.. కంటెంట్ పరంగా దానికి ఎక్కువ విమర్శలు అయితే రాలేదు. తర్వాత విజయ్ తో చేసిన ‘సర్కార్’ (Sarkar) బాగానే ఆడింది. రజినీకాంత్ తో (Rajinikanth) చేసిన ‘దర్బార్’ (Darbar) కూడా ఓకె. అయితే మురుగదాస్ పెద్దగా ఫామ్లో లేకపోయినా ఆయన చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ తో (Salman Khan) ‘సికందర్’ (Sikandar) అనే సినిమా చేస్తున్నాడు.
అలాగే శివ కార్తికేయన్ (Sivakarthikeyan) తో కూడా ‘మదరాసి’ (Madharasi) అనే సినిమా చేస్తున్నాడు. మురుగదాస్ ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న సువర్ణావకాశాలు ఇవి. కానీ ఈరోజు రిలీజ్ అయిన ‘సికందర్’ టీజర్ చూస్తే.. మురుగదాస్ కోలుకోవడం కష్టమేనేమో అనే అనుమానం ఎవ్వరికైనా రావచ్చు. అంత దారుణంగా ఉంది ఈ టీజర్. ఇందులో మురుగదాస్ మార్క్ ఏమాత్రం కనిపించలేదు.
యునానిమస్ గా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. మరి రంజాన్ కి రిలీజ్ అయ్యే ఈ ‘సికందర్’ (Sikandar) బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు నిలబడుతుందో చూడాలి. ఈ టీజర్ మరోపక్క శివ కార్తికేయన్ అభిమానులను కూడా టెన్షన్ పెడుతుంది. ‘అమరన్’ తో రూ.300 కోట్లు కొట్టి స్టార్ హీరో అయిన శివ కార్తికేయన్.. ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.