Skanda: స్కంద నిడివి ఎంతో తెలుసా.. రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ అంటూ?

రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ ఈ నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. మొదట ఈ సినిమాను వినాయక చవితి కానుకగా ఈ నెల 15వ తేదీన రిలీజ్ చేయాలని భావించినా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ ను 28వ తేదీకి మార్చడం జరిగింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 2 గంటల 47 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

స్కంద మూవీతో రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. స్కంద మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మాస్, క్లాస్ ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉందని చెబుతున్నారు.

ఈ సినిమాలో (Skanda) ట్విస్టులు సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని వాళ్లు వెల్లడిస్తున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లు గూస్ బంప్స్ వచ్చేలా బోయపాటి మార్క్ తో ఉండనున్నాయని తెలుస్తోంది. రామ్ నట విశ్వరూపం అనేలా ఈ సినిమా ఉందని సమాచారం అందుతోంది. శ్రీలీల ఈ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాత కాగా విడుదలకు ముందే భారీగా లాభాలను సొంతం చేసుకున్న నిర్మాత ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా రికార్డ్ స్థాయిలో లాభాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రామ్ కు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మాస్ సినిమాలపై దృష్టి పెడుతున్న రామ్ ఈ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus