Skanda: స్కంద ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ ఖర్చు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఆ అంచనాలను అందుకోని సినిమా ఏదనే ప్రశ్నకు స్కంద సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. స్కంద మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా టాక్, రివ్యూలు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. రామ్ మార్కెట్ ను మించి ఈ సినిమాకు ఖర్చు చేశారని కామెంట్లు వినిపించాయి.
స్కంద ఇంట్రడక్షన్ ఫైట్ కోసం ఏకంగా 4.5 కోట్ల రూపాయలు ఖర్చైందని సమాచారం.

ఈ బడ్జెట్ తో ఒక చిన్న సినిమాను తీయొచ్చనే సంగతి తెలిసిందే. ఈ ఫైట్ సీన్ కోసం ఏకంగా 29 జనరేటర్లను ఉపయోగించారట. ఇంట్రడక్షన్ సీన్ బాగా రావాలని ఖర్చు విషయంలో బోయపాటి శ్రీను ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. అయితే సినిమాలో ఆ సీన్ బాగానే ఉన్నా మరీ అద్భుతంగా అయితే లేదు. ఫైట్ సీన్ల కోసం భారీస్థాయిలో ఖర్చు చేయడం వల్ల నిర్మాతలపై అదనపు భారం పడటం మినహా ప్రయోజనం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్కంద (Skanda) సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో స్కంద2 సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు సైతం లేవని తెలుస్తోంది. వరుస ఫ్లాపులు రామ్ కెరీర్ కు శాపంగా మారాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్యతో అఖండ2 సినిమా చేస్తానని అయితే వేరియేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటానని బోయపాటి శ్రీను తెలిపారు.

గ్యాప్ తీసుకుని బాలయ్యతో సినిమా చేయాలని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సూర్యతో సినిమాను పూర్తి చేసిన తర్వాత బాలయ్యతో బోయపాటి శ్రీను సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బోయపాటి శ్రీను కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus