రాంచరణ్ (Ram Charan) అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ హడావిడి కూడా మొదలైంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా చెన్నైలో ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు.
Dil Raju
అందుకే అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు (Dil Raju) మాట్లాడి ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్ ప్లాన్ ని వివరించారు. ఇది పాన్ వరల్డ్ సినిమా కాబట్టి.. విదేశాల్లో కూడా ప్రమోట్ చేయనున్నారు. ‘నవంబర్ 9న టీజర్ లాంచ్ వేడుకని లక్నోలో నిర్వహించనున్నారు. తర్వాత అమెరికాలోని డల్లాస్ లో ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. అటు తర్వాత చెన్నైలో ఓ పెద్ద ఈవెంట్ చేస్తారట. జనవరి మొదటి వారం నుండి ఏపీ/ తెలంగాణ..లో అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేయనున్నారు.
అలా విడుదల తేదీ జనవరి 10 వరకు గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అర్ధరాత్రి 1 గంటకి షోలు వేస్తారట. లేదు అంటే ఉదయం 4 గంటల నుండి షోలు వేయడానికి ప్రయత్నిస్తామని చిత్ర బృందం చెబుతోంది. మొదటి వారం మొత్తం ఆంధ్రాలో 5 షోలు వేసుకోవడానికి, ప్రభుత్వానికి విన్నపించుకోబోతున్నట్టు కూడా టాక్ నడుస్తుంది.