ఇబ్బందులను అధిగమించి రికార్డులు సృష్టిస్తున్న పవన్.. గ్రేట్ అంటూ?

పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా బుకింగ్స్ విషయంలో ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. హైదరాబాద్ లోని మెయిన్ థియేటర్లలో ఈ సినిమాకు టికెట్స్ దొరకడం కష్టమవుతోంది. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా పవన్ మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు.

కొన్ని థియేటర్లలో శనివారం కూడా ఈ సినిమాకు టికెట్లు అందుబాటులో లేవు. ఇబ్బందులను అధిగమించి పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్నారు. సినిమా నిడివి తక్కువగా ఉండటం కూడా బ్రో సినిమాకు ఒక విధంగా ప్లస్ అవుతోందని తెలుస్తోంది. బుక్ మై షో వెబ్ సైట్ లో బుకింగ్స్ విషయంలో ఈ సినిమా చరిత్ర సృష్టిస్తోంది. అయితే బ్రో సినిమాకు కొన్ని ప్రాంతాల్లో మాత్రం థియేటర్ల సమస్య ఎదురవుతోంది.

మల్టీప్లెక్స్ లలో లిమిటెడ్ షోలు మాత్రమే ఈ సినిమా ప్రదర్శితం కానుందని బోగట్టా. మిషన్ ఇంపాజిబుల్7, బార్బీ, ఇతర హాలీవుడ్ సినిమాలు థియేటర్లలో మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. ఈ సినిమాల వల్ల కొన్ని మల్టీప్లెక్స్ లలో బ్రో షోలు పడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఓవర్సీస్ లో లిమిటెడ్ థియేటర్ల వల్ల బ్రో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడుతుందేమో చూడాలి.

అయితే టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా బ్రో సినిమా సంచలనాలు సృష్టిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బ్రో మూవీ కలెక్షన్లు రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది. బ్రో సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే కొన్ని ఏరియాలలో అయినా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బ్రో సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus