Vidudala 2: పార్ట్‌ 2 అన్నారు.. ఇదే రెండు పార్టులు అయ్యేలా ఉందిగా.. ఏం చేస్తారో మరి?

పెద్ద సినిమా అంటే రెండు రకాలు. ఒకటి బడ్జెట్‌లో పెద్ద సినిమా, రెండోది నిడివిలో పెద్ద సినిమా. ఇప్పుడు కోలీవుడ్‌ మీడియాలో రెండో రకం పెద్ద సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఓ హిట్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా నిడివి దాదాపు నాలుగున్నర గంటల అని ఓ వార్త బయటకు రావడమే. అవును మీరు చదివింది నిజమే నాలుగున్నర గంటల సినిమానే. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) , సూరి (Soori) ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ (Vetrimaaran) తెరకెక్కించిన చిత్రం ‘విడుదలై పార్ట్ 1’ / ‘విడుదల పార్ట్‌ 1’ (Vidudala 2).

Viduthalai 2:

ఈ సినిమాకు వచ్చిన వసూళ్ల సంగతి అటుంంచితే.. విమర్శకుల ప్రశంసలు మాత్రం భలేగా వచ్చాయి. సినిమా సెట్స్‌ మీద ఉన్నప్పుడే సీక్వెల్‌ గురించి చెప్పేశారు. ‘విడుదలై పార్ట్‌ 2’ (Vidudala 2) ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే అది కూడా రెండు ముక్కలు అయ్యేలా ఉంది. ‘విడుదలై పార్ట్‌ 2’ (Vidudala 2) షూటింగ్‌ పనులు చివరి దశకు రావడంతో.. ఎంత నిడివి ఉండొచ్చు అనే చర్చ మొదలైందట. ఈ క్రమంలో 4 గంటల 30 నిమిషాల లెంగ్త్‌ బయటికొచ్చిందట.

అంతేకాదు సినిమా మరో పావు శాతం షూటింగ్‌ చేయాల్సి ఉందట. ఇదంతా పూర్తయితే ఆరు గంటల సినిమా చేతిలోకి వస్తుందేమో అని అంటున్నాయి కోడంబాక్కం వర్గాలు. ఓవైపు విజయ్‌ సేతుపతి మార్కెట్ పెరగడం, సీక్వెల్స్‌ సందడి ఎక్కువగా ఉండటం వల్లనేమో మూడో ‘విడుదలై’ కూడా తీసుకొచ్చేస్తే నిడివి సమస్య ఉండదు అని టీమ్‌కు సూచనలు వస్తున్నాయట. మరి వెట్రిమారన్‌ ఏమనుకుంటున్నారో ఏమో.

నక్సలైట్ల బ్యాక్ డ్రాప్‌, పోలీసు స్టేషన్ల పరిస్థితి తదితర అంశాలను ‘విడుదల’ సినిమాలో చర్చించారు. ఇప్పుడు రెండో పార్టులో కూడా అదే ఉండబోతోంది. తొలి సినిమాలో సూరి మీద సన్నివేశాలు, ఫోకస్‌ ఎక్కువగా ఉన్నాయి. రెండో సినిమాలో విజయ్‌ సేతుపతి కీలకంగా ఉంటాడు అని అంటున్నారు. మరి మూడో పార్టు వస్తే ఏమవుతుందో, ఎవరుంటారో చూడాలి.

ఆయన విజన్‌.. సూర్య నటన కలిస్తే మరో ఆణిముత్యమే.. నెక్స్ట్‌ ఇదేనట

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus