Sobha Shetty: ఘనంగా శోభా శెట్టి ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్!

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శోభ శెట్టి ఒకరు . దాదాపు 14 వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి ఈమె ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కంటే ముందు శోభా శెట్టి సీరియల్స్ నటిస్తూ బుల్లితెర నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ లో ఈమె నటన అద్భుతం అని చెప్పాలి.

మోనిత పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి. ఇకపోతే శోభా శెట్టి బుల్లితెర నటుడు యశ్వంత్ రెడ్డిని ప్రేమిస్తున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ గత కొంతకాలంగా రహస్యంగా ప్రేమలో కొనసాగుతూ ఉన్నారు అయితే ఈ విషయం బిగ్ బాస్ కార్యక్రమంలో బయటపడింది. నాగార్జున యశ్వంత్ రెడ్డిని ఆహ్వానించడానికి ముందు తన ప్రియుడు అంటూ అందరికీ పరిచయం చేశారు.

అయితే యశ్వంత్ రెడ్డి కార్తిక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో వీరిద్దరి ప్రేమ విషయం బయటపడింది. బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాము అంటూ శోభా శెట్టి వెల్లడించారు.

అయితే ఈమె (Sobha Shetty) హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే తన ప్రియుడు యశ్వంత్ రెడ్డితో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ వేడుక బెంగుళూరులోని తన ఇంట్లో జరిగిందని తెలుస్తోంది. ఈ నిశ్చితార్థ వేడుకకు సీరియల్ బ్యాచ్ ఎవరు హాజరు కాలేదు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus