సీనియర్ ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ వంటి స్టార్ హీరోలు ఓ రేంజ్లో దూసుకుపోతున్న రోజుల్లో… ఓ ఫ్యామిలీ హీరోగా అది కూడా మీడియం రేంజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన శోభన్ బాబు.. వరుస బ్లాక్ బస్టర్లు కొట్టి వారికి చెమటలు పట్టించాడు. ఫ్యామిలీ మూవీస్ తో పాటు అప్పటి యూత్ ను ఆకట్టుకునే లవ్ స్టోరీస్ లో కూడా నటించి ఓ ట్రెండ్ ను సెట్ చేశారు శోభన్ బాబు. అందంతో పాటు మంచి నటన కూడా ఆయనకి ప్లస్ అవ్వడంతో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే కొత్త హీరోల పోటీతో ఈయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చిన రోజుల్లో సెకండ్ హీరోగా అలాగే సహాయ నటుడి పాత్రలకు కూడా ఆయన్ని దర్శకనిర్మాతలు సంప్రదించారు. కానీ వాటిని ఆయన యాక్సెప్ట్ చెయ్యలేదు. ప్రేక్షకులు తనని హీరోగానే యాక్సెప్ట్ చేశారు. అలాగే వారి గుండెల్లో నిలిచిపోవాలని అనుకుంటున్నాను అంటూ చెప్పి శోభన్ బాబు గారు కొన్ని మంచి పాత్రలను మిస్ చేసుకున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి :
1) అన్నమయ్య :
ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రకు ముందుగా శోభన్ బాబునే అనుకున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చెయ్యడంతో సుమన్ ను ఈ పాత్రకు ఎంపిక చేసుకున్నారు.
2) సుస్వాగతం :
ఈ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ తండ్రిగా శోభన్ బాబుని ఎంపిక చేసుకోవాలని నిర్మాత ఆర్.బి.చౌదరి ప్రయత్నించాడు. కానీ అందుకు శోభన్ బాబు గారు ఒప్పుకోలేదు. అంతేకాదు హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘బ్లాక్’ చిత్రాన్ని కూడా తెలుగులో శోభన్ బాబుతో రీమేక్ చేయాలనుకున్నారు ఆర్.బి.చౌదరి గారు. కానీ దీనికి కూడా శోభన్ బాబు ఒప్పుకోలేదు.
3) అతడు :
ఈ చిత్రంలో నాజర్ పోషించిన సత్యనారాయణ మూర్తి పాత్రకు మొదట శోభన్ బాబు గారిని అనుకున్నారు. ఆయన్ని సంప్రదించగా ఈ ఆఫర్ కు నొ చెప్పారట.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!