Sobhita Dhulipala: చైతన్యతో నిశ్చితార్థంపై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు.. కలలు కనలేదంటూ?
- September 26, 2024 / 12:11 PM ISTByFilmy Focus
చైతన్య (Naga Chaitanya) శోభితల (Sobhita Dhulipala) నిశ్చితార్థ వేడుక గత నెల 8వ తేదీన గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే చైతన్య శోభితల పెళ్లి జరగడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంది. శోభిత తాజాగా మాట్లాడుతూ ఎంగేజ్మెంట్ వేడుక గ్రాండ్ గా జరగాలని ప్రణాళికలు వేసుకోలేదని కలలు కనలేదని ఆమె అన్నారు. లైఫ్ లో ముఖ్యమైన క్షణాలను ఆస్వాదించాలని మాత్రమే భావించానని శోభిత పేర్కొన్నారు. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఇలాంటి వేడుకలు జరగాలని ఎప్పుడూ అనుకునేదానినని శోభిత చెప్పుకొచ్చారు.
Sobhita Dhulipala

నా పేరెంట్స్ సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారని ఆమె తెలిపారు. వాటితో నేను మమేకమై ఉన్నానని ఆమె పేర్కొన్నారు. అనుకున్న విధంగా సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ప్రశాంతంగా, సంప్రదాయ బద్ధంగా జరిగిందని శోభిత వెల్లడించారు. అందమైన క్షణాలతో నా మనస్సు నిండిందని ఆమె పేర్కొన్నారు. అందువల్ల నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగిందని నేను ఫీల్ కావట్లేదని శోభిత అన్నారు.

నా వరకు ఈ వేడుక చాలా పర్ఫెక్ట్ గా పూర్తైందని ఆమె వెల్లడించారు. పెళ్లి తర్వాత కూడా శోభిత సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తారని అయితే ఎంచుకునే రోల్స్ విషయంలో ఆమె కొన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. చైతన్య శోభిత పెళ్లి గురించి, పెళ్లి వేదిక గురించి త్వరలో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాగచైతన్య పారితోషికం 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండగా శోభిత రెమ్యునరేషన్ మాత్రం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.

చైతన్య శోభిత కెరీర్ పరంగా ఎదగడంతో పాటు సక్సెస్ రేట్ ను పెంచుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. శోభిత హాలీవుడ్ ప్రాజెక్ట్ లలో సైతం నటించడం ద్వారా తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. చైతన్య 2025 ఫస్టాఫ్ లో తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.













