టైర్ 2 బాక్సాఫీస్.. సౌత్ లో బిగ్గెస్ట్ ఓపెనర్లు వీరే..!

సౌత్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌లో టైర్ 2 హీరోలు కూడా అదరగొడుతున్నారు. ముఖ్యంగా గతంలో సాధ్యమయ్యే రేంజ్ కంటే ఈ మధ్యకాలంలో టైర్ 2 హీరోల సినిమాలు భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంటున్నాయి. రీసెంట్ గా శివ కార్తికేయన్ (Sivakarthikeyan)  హీరోగా వచ్చిన ‘అమరన్’ (Amaran)  సినిమా విడుదలైన తొలి రోజే భారీ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా ఏకంగా రూ. 36 కోట్లు గ్రాస్ వసూలు చేసి, శివ కార్తికేయన్ కెరీర్‌లోనే టాప్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.

Heroes

‘అమరన్’ విడుదల తర్వాత మొదటి రోజు సౌత్ ఇండియా బాక్సాఫీస్‌పై శివ కార్తికేయన్ కొన్ని రికార్డులను బ్రేక్ చేశాడు. దీంతో కోలీవుడ్‌ లోనే కాకుండా సౌత్ లో కూడా అతని పేరును గట్టిగా వినిపిస్తోంది. టైర్ 2 హీరోల లిస్టులో అత్యధిక (Naga Chaitanya)  కలెక్షన్లు సాధించిన హీరోల లిస్టులో శివ కార్తికేయన్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , నాని (Nani) , నాగ చైతన్య వంటి స్టార్‌లను దాటేశాడు. ‘ఖుషి’ మూవీతో విజయ్ దేవరకొండ 27 కోట్లు వసూలు చేసిన రికార్డును శివ కార్తికేయన్ బ్రేక్ చేశాడు.

ఇక ఈ లిస్టులో టాప్ ప్లేస్‌లో నేచురల్ స్టార్ నాని నిలిచాడు. అతని ‘దసరా’ (Dasara)  చిత్రం విడుదల రోజే 38 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. నాని తర్వాతి స్థానంలో ఇప్పుడు శివ కార్తికేయన్ నిలిచాడు. విజయ్ దేవరకొండ ఖుషి (Kushi)  27 కోట్లు, లైగర్ (Liger) 25 కోట్లు, రాయన్ (Raayan) 24.20 కోట్లు, సరిపోదా శనివారం  (Saripodhaa Sanivaaram) 22 కోట్లు వసూలు చేసి ఆ తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.

సౌత్ ఇండియాలో 20 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ సాధించిన టైర్ 2 హీరోల సినిమాలు లిస్టులో ఇవే ఉండటం విశేషం. మరి ఈ రికార్డులను మరోసారి బ్రేక్ చేసే అవకాశం ఎవరికుంటుందో చూడాలి. ఇక అమరన్ జోష్ ఇలానే కొనసాగితే టైర్ 1 హీరోల రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి సినిమా టోటల్ గా ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

హనుమంతుడు ఓకే.. శ్రీరాముడు సంగతేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus