ఎస్పీ బాలు కొడుకు ఎస్పీ చరణ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఎస్పీ చరణ్ నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా ఎస్పీ చరణ్ సుపరిచితమైన వ్యక్తి కావడం గమనార్హం. తన ప్రతిభతో ఎస్పీ చరణ్ పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.
అయితే గత కొన్ని రోజులుగా ఎస్పీ చరణ్ సోనియా అగర్వాల్ పెళ్లి చేసుకోనున్నారంటూ వెబ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎస్పీ చరణ్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వల్ల ఈ వార్తలు వైరల్ అయ్యాయి. 7/జీ బృందావన కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్ తో కలిసి సన్నిహితంగా దిగిన ఫోటోను ఎస్పీ చరణ్ షేర్ చేయగా కొంతమంది నెటిజన్లు చరణ్ సోనియా జోడీ బాగుందని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.
మరి కొందరు నెటిజన్లు త్వరలోనే ఎస్పీ చరణ్ సోనియా పెళ్లంటూ ప్రచారం మొదలుపెట్టారు. వైరల్ అయిన కామెంట్లను చూసిన ఎస్పీ చరణ్ మరో పోస్ట్ లో ఫుల్ ఫోటోను షేర్ చేశారు. చరణ్ షేర్ చేసిన మరో పోస్ట్ లో ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్ తో పాటు అంజలి, మరో నటుడు ఉన్నారు. ఎస్పీ చరణ్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా సోనియా అగర్వాల్ భర్త సెల్వ రాఘవన్ నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా జీవనం సాగిస్తున్నారనే సంగతి తెలిసిందే.
అయితే ఎస్పీ చరణ్ సోనియా అగర్వాల్ పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని వెబ్ సిరీస్ షూటింగ్ లో భాగంగా దిగిన ఫోటోలు ఈ విధంగా ప్రచారంలోకి వచ్చాయని సమాచారం. ఎస్పీ చరణ్ సోనియాతో కలిసి దిగిన ఫోటోను ఫోటోను జూమ్ చేసి షేర్ చేయడంతో ఈ సమస్య ఎదురైంది. ఎస్పీ చరణ్ సోనియా అగర్వాల్ వైరల్ అవుతున్న కామెంట్ల గురించి స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు భావిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
Comments