స్టార్ హీరోతో సినిమా అంటే మామూలు విషయం కాదు. చాలా లెక్కలు ఉంటాయి. హీరో ఇమేజ్ కి తగ్గ కథను సిద్ధం చేయాలి. కథ బాగున్నప్పటికీ అది హీరోని డామినేట్ చేయకుండా చూసుకోవాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కొన్ని సార్లు కథకు అవసరం లేకపోయినా.. పాటలు, సీన్లు యాడ్ చేస్తుంటారు. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమా బాలీవుడ్ ‘పింక్’ సినిమాకి రీమేక్.
అయితే ఈ కథను తెలుగుకి తగ్గట్లు మారుస్తున్నప్పుడు చాలా జిమ్మిక్కులు చేయాల్సి వస్తోంది. ఒరిజినల్ సినిమాలో లేని హీరోయిన్ ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. అలానే ఫైట్లు కూడా జోడించారు. ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ కూడా పెట్టబోతున్నారని సమాచారం. అయితే అది ఐటెం సాంగ్ మాత్రం కాదట. సినిమా ప్రారంభంలో టైటిల్స్ మీదే ఓ సాంగ్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఈ పాట ఉంటుందని సమాచారం.
మరోపక్క ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ పరిస్థితి కూడా ఇంతే. పవన్ కోసం కథలో చాలా మార్పులు చేస్తున్నారు. త్రివిక్రమ్ స్టైల్ లో కొంత కామెడీని మిక్స్ చేసి, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని యద చేసి.. పవన్ పాత్రకు మరింత వెయిట్ ఇచ్చేనందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. పవన్ పై ఉన్న ప్రేమతో త్రివిక్రమ్ అతడి పాత్రను మరింత బాగా ఎలివేట్ చేయాలని చూస్తున్నాడు. మొత్తానికి ఈ రెండు రీమేక్ కథల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇవన్నీ అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటాయో చూడాలి!