SR Kalyanamandapam: ఎస్ ఆర్ కల్యాణమండపం ఓటీటీ లో ఎప్పుడంటే?

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం యువ నటుల రాక సినిమా పరిశ్రమలో మరింతగా పెరుగుతోంది. అయితే అలా వస్తున్న వారిలో ఎక్కువమంది తమ అద్భుతమైన టాలెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఆ విధంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ నటుడు కిరణ్ అబ్బవరం ఆ మూవీ తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బాగా రెస్పాన్స్ దక్కించుకుంది.

కిరణ్ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ సాయి కుమార్ కీలక పాత్ర చేసారు. మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని శ్రీధర్ గద్దె తీశారు. అయితే మ్యాటర్ ఏమిటంటే త్వరలో ఈ సినిమాని ఒటిటి లో విడుదల చేయనున్నారు అనే వార్త ఇటీవల వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ప్రముఖ ఒటిటి మాధ్యమం ఆహా వారితో ఇప్పటికే భారీ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ మూవీని ఈ నెల 28న ఆహా లో ప్రసారం చేయనున్నారట, దీనికి సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే సత్యదేవ్ తిమ్మరుసు మూవీ యూనిట్ కూడా ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారితో ఒప్పందం చేసుకుని తమ సినిమాని కూడా అదే రోజున విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే అటు థియేటర్స్ లో బాగా సక్సెస్ సాధించిన ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా ఇటు ఓటిటి లో కూడా సక్సెస్ కొట్టడం ఖాయం అని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus