Sr NTR: ఎన్టీఆర్ చనిపోయేముందు తనకిష్టమైన స్నేహితుడికి ఫోన్ చేసి ఏమన్నారంటే?

సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ హీరో గతంలో చాలా మల్టీస్టారర్ సినిమాల్లో చేశారు. అందులో మరీ ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్నార్ల జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. వీరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటి జనరేషన్ లో చాలామంది హీరోల అభిమానులు మల్టీస్టారర్ సినిమాలు తీస్తే ఒప్పుకోవడం లేదు. కానీ గతంలో అయితే చాలామంది స్టార్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేసేవారు.

అయితే గతంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ల జోడీకి హిట్ పెయిర్ గా సిల్వర్ స్క్రీన్ పై మంచి గుర్తింపు వచ్చింది. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఎన్టీఆర్ ఏఎన్నార్ల మధ్య బంధం చెడిపోయింది.ఇక దీనికి కారణం ఏంటో ఎవరికి తెలియదు.కానీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాటల కారణంగానే వీరిద్దరూ విడిపోయారని గతంలో వార్తలు వినిపించాయి. అయితే వీరిద్దరి విషయం గురించి రచయిత కృష్ణకుమారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు.

వీరి మధ్య బంధం ఎలా ఉండేదంటే ఒకరి ఇంట్లో ఫంక్షన్ అయితే మరొకరు హాజరయ్యే వారు.కానీ అలాంటి వీరి మధ్య ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చెప్పుడు మాటలతో మీరు బంధం చెడిపోయింది.కానీ ఆ తర్వాత మళ్లీ వీళ్ళు కలిసి పోయారు. అయితే ఓ రోజు నేను ఏఎన్ఆర్ గారి ఇంటికి వెళ్లినప్పుడు ఏఎన్ఆర్ కి సీనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి బ్రదర్ మిమ్మల్ని ఒకసారి చూడాలనిపిస్తుంది అంటే అదేంటి బ్రదర్ ఎందుకు అలా అంటున్నారు. మొన్ననే కదా మనం కలిసాం.మీ ఇంటికి భోజనానికి కూడా వచ్చాను అని ఏఎన్ఆర్ అన్నారు.

కానీ దానికి ఎన్టీఆర్ (Sr NTR) లేదు బ్రదర్ మరొకసారి మిమ్మల్ని కలిసి నా మనసులో ఉన్న బాధ మొత్తం తీర్చేసుకుంటాను. ఒకసారి మా ఇంటికి రండి అని చాలా ఎమోషనల్ గా అడిగారు. అయితే వీరిద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటునప్పుడు రచయిత కృష్ణకుమారి అక్కడే ఉన్నారట. అంతేకాదు ఈ విషయాలన్నీ ఏఎన్ఆర్ ఆయన భార్య అన్నపూర్ణమ్మతో కూడా చెప్పుకున్నారట. కానీ ఏఎన్ఆర్ మరుసటి రోజు ఎన్టీఆర్ ను చూడడానికి వెళ్దాము అనుకునే టైంలోనే ఎన్టీఆర్ చనిపోయారు అని మరణ వార్త వినిపించింది. అలా సీనియర్ ఎన్టీఆర్ చనిపోయే ముందు ఏఎన్ఆర్ ని చూడాలని కన్నీళ్లు పెట్టుకున్నారట.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus