చిత్తూరు వి. నాగయ్య. సినిమా ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో దాదాపు మూడు దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన ఏకైక హీరో. ఆయనే హీరోగా.. వందల సినిమాలు వచ్చాయి. సుమారు 1500 సినిమాల్లో ఆయన నటించారు. నిజానికి ఒక్క సినిమా తీయాలంటేనే అప్పట్లో కనీసం రెండేళ్ల సమయం పట్టేది. అలాంటి రోజుల్లోనే ఆయన 1500 సినిమాల్లో నటించారంటే.. ఎంత బిజీనో వేరేచెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. నాగయ్య ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఏ రోజూ.. తన గొప్పను అంగీకరించేవారు.
నిజానికి కొన్నాళ్లుగా చూస్తే.. హీరోలు.. హీరోయిన్లు పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకుని మరీ.. తమను తాము పొడిగించుకుంటు న్నారు. కానీ, నాగయ్య తనను తాను ఎప్పుడూ కీర్తించుకోలేదు. అంతేకాదు. వేదికలపై ఎవరైనా పొడిగితే.. దానికి పరిహారంగా.. ఆయన వెంటనే ఓ వంద మందికి భోజనాలు పెట్టేసేవారట. అదేమని ఎవరైనా అడిగితే.. పుణ్యం-పుణ్యంతో సరి! అని చెప్పేవారట. ఒకసారి నాగయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. తెలుగుఇండస్ట్రీ నుంచి ఆ ఏడాది నాగయ్య ఒక్కరే ఎంపికయ్యారు.
అంతకు ముందు కూడా.. ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు. అలాంటిది ఆయన దానిని గొప్పగా ఫీల్ కావాలి. పైగా.. ఇప్పుడైతే.. సోషల్ మీడియాలోనే ప్రచారం ఎక్కువగా జరిగిపోతోంది. అప్పట్లో అసలు మీడియానే తక్కువ దీంతో.. ఇచ్చేవారికి.. పుచ్చుకునేవారికి.. మాత్రమే తెలిసేది. అయితే.. కేంద్రం తనకు ఫోన్ చేసి.పద్మశ్రీ అవార్డు ప్రకటించినా.. నాగయ్య ఎవరికీ చెప్పలేదు. ఓ రోజు అకస్మాత్తుగా.. ఆయన వాహినీ స్టూడియోకు నాలుగు రోజులు సెలవులు పెట్టారు. దీనిపై అక్కినేని ఆరా తీశారు. నాగయ్య గారు షూటింగుకు సెలవు పెట్టారని తెలిసి..ఆయన ఇంటికి వెళ్లారు.
అప్పటికి కానీ.. పద్మ శ్రీ అవార్డు వచ్చిన విషయం తెలియలేదు. దీంతో అక్కినేనే అందరికీ ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం తెలిసి .. అన్నగారు.. నాన్నగారు.. మాకు చెబితే.. ఒక ఉత్సవం ఏర్పాటు చేసేవారం కదా! అన్నారు. దానికి నాగయ్య చిరునవ్వు నవ్వి.. నాకన్నా.. మీరు బాగా నటిస్తున్నారు. మీకు కూడా వస్తే బాగుండేది అనే సరికి.. అన్నగారు ఆనందం తట్టుకోలేక.. షూటింగ్ స్పాట్‌లోనే ముద్దు పెట్టి.. కాళ్లకు పాదాభివందనం చేశారు. తర్వాత సొంత ఖర్చుతో.. (Sr NTR) అన్నగారు 200 మందికి భోజనాలు పెట్టి నాగయ్యను సత్కరించారు.