‘అప్పట్లో ఒకడుండే వాడు’ ‘మెంటల్ మదిలో’ ‘నీదీ నాదీ ఒకే కథ’ ‘బ్రోచేవారెవరురా’ వంటి హిట్ చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న హీరో శ్రీవిష్ణు. నిజ జీవితంలో ఎప్పుడూ చాలా సైలెంట్ గా ఉంటూ తన పని తను చేసుకుంటూ ముందుకు సాగే శ్రీవిష్ణు.. ఇప్పుడు ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా.. భయంకరంగా విజృంభిస్తుంది.రోజు రోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్‌ను కనిపెట్టడానికి డాక్టర్లు ఎంతో కృషి చేస్తున్నప్పటికీ.. ఇంకా దానికి చాలా టైం పట్టేలా ఉంది.
అయితే ఈ వైరస్ మహమ్మారి బారిన పడినవారు ఎంతో మంది కోలుకుంటుంటే.. మరికొంత మంది మాత్రం ప్రాణాలు కోల్పోతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. అలాంటి వారిని కాపాడటానికి కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీని డాక్టర్లు ప్రవేశపెట్టారు.ఇందులో భాగంగా.. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే ప్లాస్మా థెరపీని మొదలుపెట్టారు. అయితే ఈ ప్లాస్మా థెరపీ కోసం వైరస్ మహమ్మారి నుండీ కోలుకున్న వ్యక్తుల నుండీ ప్లాస్మాను సేకరించాల్సి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. క*నా మహమ్మారి నుండీ కోలుకున్న వ్యక్తులు ప్లాస్మాను దానం చెయ్యడానికి ముందుకు రావాలన్న మాట.! అయితే ఇందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు.
మళ్ళీ వారికి ఏదో హాని జరుగుతునేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం లేదు. అయితే దీని వల్ల ఎటువంటి ప్రమాదానికి గురవ్వరు. ఇందుకోసమే ప్రజలకి ఈ ప్లాస్మా దానం గురించి అవగాహన వచ్చేలా హీరో శ్రీవిష్ణు శ్రీకారం చుట్టాడు. ‘డొనేట్ ప్లాస్మా’ అంటూ క్యాంపైన్‌ను మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా ‘డొనేట్ ప్లాస్మా అండ్ సేవ్ లైఫ్’ అని రాసి ఉన్న ఇమేజ్‌ను తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని.. హీరో నారా రోహిత్, హీరోయిన్ నివేదా థామస్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా కోరాడు. ‘ఈ క*నా కష్టకాలంలో ప్లాస్మా గురించి అవగాహన కల్పించి ప్రాణాలను కాపాడాల్సిందిగా శ్రీవిష్ణు బ్రతిమాలుతున్నాడు.