ఆ పోస్ట్ తో మరోసారి చర్చల్లోకి శ్రీజ కళ్యాణ్ దేవ్!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గత కొంతకాలం నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈమె తన విడాకుల విషయం గురించి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి శ్రీజ తన భర్తకు దూరంగా ఉండటంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇకపోతే శ్రీజ తన భర్తతో విడాకులు తీసుకుందని అయితే ఈ విషయాన్ని బయటకు వెల్లడించకుండా తాను మరో పెళ్లికి సిద్ధమైనది అంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ విధంగా వీరి విడాకుల గురించి శ్రీజ మూడో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించలేదు.ఒకవేళ ఇవన్నీ అవాస్తవాలు అయినప్పటికీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలలోనూ కూడా కళ్యాణ్ దేవ్ పాల్గొనలేదు. అలాగే తన భార్య శ్రీజతో కలిసి ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు. ఇక కళ్యాణ్ కనీసం తన పిల్లలతో కూడా ఎక్కడ కనిపించలేదని చెప్పాలి. గతంలో కళ్యాణ్ దేవ్ శ్రీజ మొదటి భర్త కూతురు నివృత్తితో కూడా ఎంతో సంతోషంగా ఉండే వారు.

అయితే ఆమె పుట్టినరోజు సందర్భంగా కూడా తనకు ఏ విధమైనటువంటి విష్ చేయలేదు. అయితే గత కొద్దిరోజుల క్రితం తన కూతురు నవిష్కతో మాత్రమే కనిపించారు. అయితే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారని అందరూ భావిస్తున్న సమయంలో శ్రీజ పెద్ద కుమార్తె నివృత్తి చేసిన పోస్ట్ వల్ల మరోసారి వీరి విడాకుల విషయం వార్తలలోకి వచ్చింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నివృతి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తాను స్కూల్ డేస్ మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చారు.

ఇలా నివృతి షేర్ చేసిన ఫోటోలలో కళ్యాణ్ దేవ్ నవిష్క ఫోటోలు కూడా ఉండడం గమనార్హం. ఒకవేళ శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోయి ఉంటే నివృత్తి కళ్యాణ్ ఫోటోని ఎందుకు షేర్ చేస్తుందని మరోసారి నెటిజన్లు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఏది ఏమైనా నివృత్తి ఈ ఫోటోతో కళ్యాణ్, శ్రీజ విడిపోలేదని క్లారిటీ ఇచ్చార.. లేక క్యాజువల్ గా ఈ ఫోటోలు షేర్ చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus