Sreeja Konidala: తనతో చేసిన చాట్ సీక్రెట్ బయటపెట్టిన శ్రీజ.. ఏముందో తెలుసా?

శ్రీజ కొణిదెల ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఈమె ఎప్పుడైతే తన సోషల్ మీడియా ఖాతాలలో తన భర్త పేరు తొలగించారో అప్పటినుంచి ఈమెకు తన భర్తకు మధ్య విభేదాలు వచ్చాయని విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ కూడా శ్రీజకు దూరంగా ఉండటమే కాకుండా మెగా కుటుంబంలో జరిగే ఎలాంటి కార్యాలకు కూడా హాజరు కాలేదు.

ఈ విధంగా వీరిద్దరూ దూరంగా ఉండటం వల్ల నేటిజన్ లి వీరు విడాకులు తీసుకొని విడిపోయారని శ్రీజ మరో పెళ్లికి సిద్ధమవుతుందని వార్తలు సృష్టించారు.ఈ విధంగా ఈమె మూడో పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలు పై కొందరు నిర్మాతలు స్పందించి ఈ వార్తలను తప్పుపట్టారు. ఇలా శ్రీజ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె తన భర్త నుంచి దూరంగా ఉంటున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

ఈ విధంగా శ్రీజ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా తన వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త క్షణాల్లో వైరల్ అయింది. ఇంతకీ ఈమె ఎవరితో చాట్ చేసిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు అందులో ఏముంది అనే విషయానికి వస్తే.. శ్రీజ మొదటి కుమార్తె నివృత్తి గురించి అందరికీ తెలిసిందే. నివృత్తి వాట్సప్ ద్వారా తన తల్లికి గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపించారు.

అయితే గుడ్ మార్నింగ్ మెసేజ్ ను ఎమోజిల ద్వారా పంపించారు. గుడ్డు అలాగే సూర్యుడు ఎమోజి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో శ్రీజ స్మైలీ ఎమోజి షేర్ చేసింది. దీంతో తన కూతురు రిప్లై ఇస్తూ అమ్మ నేను నీకేం నేర్పించాను ఇలాంటివి నాకు నచ్చావ్ అని తెలుసు కదా ముందు వాటిని మార్చు అంటూ మెసేజ్ చేసింది.

ఈ క్రమంలోనే తన కూతురు చేసిన మెసేజ్ కు శ్రీజ రిప్లై ఇస్తూ మేము పాతకాలపు మనుషులం అంటూ మెసేజ్ చేసింది. ఈ విధంగా శ్రీజ తన కూతురికి రిప్లై ఇవ్వడంతో నివృత్తి హ హ హ అంటూ నవ్వేశారు. అయితే శ్రీజ వీరిద్దరి వాట్సాప్ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నేటిజన్స్ శ్రీజ ఈ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేసిందనే విషయం గురించి ఆరా తీస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus