Sreeja, Kalyan: చిరు చిన్నకూతురు విడాకులు తీసుకుంటుందా..?

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహ జీవితానికి సంబంధించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీజ తన భర్త కళ్యాణ్ తో విడిపోతుందంటూ కథనాలను ప్రచురిస్తున్నారు. దానికి తగ్గట్లే.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి భర్త పేరుని తొలగించింది శ్రీజ. ఇప్పటివరకు తన పేరుని శ్రీజ కళ్యాణ్ అని సోషల్ మీడియా హ్యాండిల్ లో రాసేది శ్రీజ. ఇప్పుడు కళ్యాణ్ ను తొలగించి శ్రీజ కొణిదెల అని రాసింది. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

గతేడాదిలోనే వీరిద్దరూ విడిపోతారని పుకార్లు షికారు చేశాయి. మెగా ఫ్యామిలీ వేడుకల్లో ఎక్కడా కూడా కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదని కొందరు కామెంట్స్ చేశారు. ఇప్పుడేమో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి తన భర్త పేరుని తొలగించి షాకిచ్చింది శ్రీజ. అయితే అకౌంట్ లో మాత్రం తన భర్తకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయలేదు. దీంతో ఇంకా వీరు కలిసే ఉన్నారని కొందరు అంటున్నారు. అధికారికంగా ఈ జంట ఏమీ చెప్పలేదు కాబట్టి ఊహాగానాలను ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

శ్రీజ.. కళ్యాణ్ ను రెండో వివాహం చేసుకుంది. మెగా అల్లుడైన తరువాత కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమయ్యాడు. ‘విజేత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సమయంలో మెగాహీరోలు చాలా మంది కళ్యాణ్ ను సపోర్ట్ చేశారు. రీసెంట్ గా కళ్యాణ్ నటించిన ‘సూపర్ మచ్చి’ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మెగా ఫ్యామిలీ పాల్గొనలేదు. ఒక్కరు కూడా సినిమాకి సంబంధించిన పోస్ట్ లను పెట్టలేదు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus