ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 (Pushpa 2) కోసం ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ఐదు భాషల్లో విడుదల కానుంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో పాటు ముఖ్యమైన సీన్స్ కూడా పూర్తి అయిపోయినట్లు సమాచారం. కానీ, అందరి దృష్టిని ఆకర్షించే ఐటెం సాంగ్ మాత్రం ఇంకా చిత్రీకరించలేదు. సుకుమార్ (Sukumar) ఈ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది ఫ్యాన్స్ మధ్య చర్చగా మారింది.
Pushpa 2
పుష్ప 1 (Pushpa) లో సమంత చేసిన ఊ అంటావా పాట ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఈ పాట ప్రేక్షకులలో పాపులర్ గా మారి ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 లో ఈ పాటకు ధీటుగా మరో ఐటెం సాంగ్ ను సెట్ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఆ పాట కోసం సరైన హీరోయిన్‌ను ఫిక్స్ చేయడం ఇంకా ఆలస్యం అవుతుండటం హాట్ టాపిక్ గా మారింది.
మొదట, ఈ ఐటెం సాంగ్ కోసం పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు పరిశీలించారు. యానిమల్ (Animal) బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri) , దిశ పటాని (Disha Patani) , శ్రద్ధ కపూర్ (Shraddha Kapoor) లాంటి పేర్లు ముందుకు వచ్చాయి. కానీ, వీరు డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ కారణంగా పక్కన పెట్టినట్లు సమాచారం. తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల పేరు మరోసారి ప్రముఖంగా వినిపిస్తోంది. శ్రీలీల (Sreeleela) మంచి డాన్సర్ అనే సంగతి తెలిసిందే, ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ పాటకు అద్భుతంగా సరిపోతుందనేది సుకుమార్ అభిప్రాయం అని తెలుస్తోంది.
సమయం తక్కువగా ఉండటంతో త్వరగా ఐటెం సాంగ్ కోసం హీరోయిన్‌ను ఫిక్స్ చేసి చిత్రీకరణ పూర్తిచేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అల్లు అర్జున్‌తో గతంలో ఒక యాడ్‌లో కనిపించిన శ్రీలీల, డాన్స్ పరంగా కూడా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. త్వరలో ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.