Sreeleela: శ్రీలీలకి మరో బంపర్ ఆఫర్.. ఏకంగా పవన్ సినిమాలో..!

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సక్సెస్ అందుకున్న ‘వినోదయ సీతం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ రీమేక్ ను తెరకెక్కిస్తుండడం విశేషం. నిజానికి ఒరిజినల్ చూసుకుంటే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఎక్కువగా ఉండవు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో చూసేసిన ‘ఆ నలుగురు’ చిత్రానికి దగ్గరగా ఉంటుంది ఈ చిత్రం.

అయితే తెలుగుకి వచ్చేసరికి చాలా మార్పులు చేశారు. ‘ఒరిజినల్ థీమ్ ప్రకారం సమస్తం మన ద్వారానే జరగదు.. జరిగేదాంట్లో మనం పాత్రధారులం మాత్రమే’ అనే పాయింట్ ను మాత్రమే తీసుకుని చాలా మార్పులు చేసినట్లు వినికిడి.స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. పవన్ విన్నపం మేరకు ఈ స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్టు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టులో మరో హీరోయిన్ కూడా భాగం కానుంది.

ఆమె మరెవరో కాదు శ్రీలీల. అయితే శ్రీలీల చేసేది స్పెషల్ సాంగ్ మాత్రమే. ఇదే బ్యానర్లో ఆమె ‘ధమాకా’ మూవీ చేసింది. అందుకే పవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారట నిర్మాతలు. ఆమె డాన్స్ చాలా బాగా చేస్తుంది. ఆమెతో స్పెషల్ సాంగ్ చేయిస్తే సినిమాకి హెల్ప్ అవుతుంది అనేది నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది.

త్రివిక్రమ్.. మహేష్ తో చేస్తున్న మూవీలో కూడా శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘వినోదయ సీతం’ రీమేక్ లో సాయి తేజ్ సరసన హీరోయిన్ గా కేతిక శర్మని తీసుకున్నట్లు టాక్ నడిచింది. కానీ చిత్ర బృందం ఇంకా కన్ఫర్మ్ చేసింది లేదు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus