కార్తికేయ2 చూసాక చాలా మందికి కృష్ణుడు గురించి పూర్తిగా తెలుసుకున్నాం అనే సంతృప్తితో థియేటర్ల నుండి బయటకు వస్తారు. అప్పటి వరకు శ్రీకృష్ణుడు అంటే మంచి మనసున్న వాడు, పదహారు వందల మంది గోపికలతో ప్రేమాయణం, అర్జునుడికి రథసారథి, ధర్మం వెనుక ఉంటాడు.. వంటి ఆలోచనలు కలిగి ఉండొచ్చు. కానీ శ్రీ కృష్ణుడు మిత్ మాత్రమే కాదు ఓ చరిత్ర అని ‘కార్తికేయ 2’ లో ప్రజెంట్ చేశారు.
1) సినిమాలో ముద్ర వాళ్ళ తాతగారు అయిన రావు పాత్రతో సినిమా మొదలవుతుంది. నిజ జీవితంలో ద్వారకా నగరం గురించి కనుగొన్నది కూడా ఎస్.ఆర్.రావు కావడం విశేషం. ఆయన ది లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా అనే బుక్ కూడా రాయడం జరిగింది.
2) 2001 లో పొల్యూషన్ చెక్ చేసినప్పుడు ఒక రాక్ ఫార్మేషన్ కనిపించింది. అప్పుడు రావు గారికి లోపలికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగింది. అంతకు ముందే ఎన్నో పురాతన వస్తువులు దొరికాయి. వాటిని ఆధారం చేసుకుని సముద్రానికి 70 నుండి 90 అడుగుల లోతుకు వెళితే ఒక ఆర్గనైజ్డ్ రాక్ ఫార్మేషన్ కనిపించింది.
3) అయితే ఈ రాక్ ఫార్మేషన్ అంతా వెజిటేషన్ తో కప్పబడి ఉంది. ‘కార్తికేయ 2’ లో అంటారు కదా ‘అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ సముద్రం వరకు ముడిపడి ఉన్న ఒక మహా చరిత్ర’ అని. అరేబియన్ సముద్రంలోనే ఈ ద్వారకా సిటీ రిమైన్స్ దొరికాయి.
4) అలా అరేబియన్ సముద్రంలో దొరికిన సిటీ 7 కి మీ నుండి 9 కి మీ లెంగ్త్, మరియు 3 కి మీ నుండి 4 కిమీ విడ్త్ అని తెలుస్తుంది.
5) అక్కడ నుండి 20 మైల్స్ దూరం వెళ్తే.. ఒక ఐలాండ్ వస్తుంది. అక్కడ రావు గారికి ఓ 550 మీటర్ల గోడ దొరికింది. దాని గురించి 2003 లో ఓ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
6) అందులో ద్వారకా లా ఉంది అని పేర్కొన్నారు. అంతేకాదు ‘ది లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా’ అనే బుక్ కూడా రాశారు. అందులో మహా భారతానికి లింక్ చేస్తూ చాలా విషయాలే చెప్పారు. ఆయనకు గుర్తు గానే ‘కార్తికేయ 2’ సినిమాలో రావు పాత్రని పెట్టారనుకుంట మేకర్స్.
7) సినిమా స్టార్టింగ్ లో కృష్ణుడి బొటన వేలుకి బాణం తగలడం వల్ల కృష్ణుడు దేహం విడిచినట్టు చూపిస్తారు. అంతకు ముందే కాలికి ఉన్న కంకణం తన స్నేహితుడుకి ఇచ్చినట్టు చూపిస్తారు. ఇక్కడ కంకణం అనేది ఫిక్షన్.
8) కడుపు కోతకు గురైన గాంధారి శాపనార్ధాలు కృష్ణుడు మోయాల్సి వచ్చింది. పాండవులకు కొమ్ము కాచి, కౌరవులను అంతం చేసినందుకు ‘నువ్వు నీ వంశం వారు సర్వ నాశనం అయిపోయి పాతాళంలో కలిసిపోతారు. నీవు కూడా రక్తం చిందిస్తూ ప్రాణం విడుస్తావు. నేనే మహా పతివ్రత అయితే ఇదే నీకు నా శాపం’ అంటూ తన కళ్ళకు కట్టిన గంతలు తీసి మొదటగా కృష్ణుడు పాదాలు చూసి పైకి చూడగా విష్ణుమూర్తి అవతారం ఆమెకు కనిపిస్తుంది. మానవుడిగా పుట్టినందుకు నీ శాపం అనుభవించడం న్యాయమే.. నేను మనస్ఫూర్తిగా అనుభవిస్తాను’ అంటూ చెబుతాడు.
9) అదే వేదనతో కృష్ణుడు మురళి వాయిస్తూ నాట్యం చేస్తూ ఉండగా.. బోయవాడు జింక అనుకుని బాణం వేస్తాడు. అది తగిలి కృష్ణుడు దేహం విడిచినట్టు చూపించారు.
10) శ్రీ కృష్ణుడి పాదం.. జింక పాదంలా బోయవాడికి ఎందుకు కనిపించి ఉంటుంది అనే డౌట్ మీకు రావచ్చు. కృష్ణ జింక మెడ నల్లగా.. కంఠం దగ్గర తెల్లగా ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడు నీలి మేఘ శ్యాముడు కాబట్టి… నల్లనయ్య కాబట్టి అతని పాదం పైన నల్లగా, అరికాలు తెల్లగా ఉండడం వల్ల.. అది కృష్ణ జింక మెడ అని భ్రమ చెంది బాణం వదిలాడు బోయవాడు. ఆ బోయవాడు(జరుడు) త్రేతాయుగం నాటి వాలి. త్రేతాయుగంలో రామావతారంలో వాలిని చంపుతాడు కృష్ణుడు. అందువల్లే కృష్ణుడుగా అతని చేతిలో చంపబడ్డాడు.