కొన్ని రకాల సినిమాలకు కొంతమంది సంగీత దర్శకులే కరెక్టే. వాళ్లు అయితేనే ఆ సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేస్తారు అని అంటుంటారు అభిమానులు. ఆ సినిమాల ఫలితాలు, అందులో సంగీత దర్శకుడి కాంట్రిబ్యూషన్ కూడా ఇదే విషయాన్ని చెబుతుంటుంది. అలాంటి సంగీత దర్శకుల్లో శ్రీచరణ్ పాకాల ఒకరు. ఇంటెన్ష్ యాక్షన్ థ్రిల్లర్లకు సంగీతం అందించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు చూస్తే ఎవరైనా ఇదే మాట చెబుతారు.
అలా అని ఆయన అన్ని రకాల సినిమాలు చేయడం లేదా అంటూ అన్నీ చేస్తున్నారు. కానీ ఆ థ్రిల్లర్ జోనర్ సినిమాలకే విజయాల శాతం ఎక్కువగా ఉంది . ప్రస్తుతం ‘బబుల్ గమ్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీచరణ్ పాకాల తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇకపై అన్ని రకాల సినిమాలను ఒప్పుకునేది లేదని, సెలక్టివ్‌గా కొన్ని సినిమాలు ఓకే చేసి ముందుకెళ్తానని తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
‘క్షణం’, ‘పిఎస్‌వి గరుడవేగ’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘డిజె టిల్లు’, ‘మేజర్’లాంటి చిత్రాలతో సంగీత దర్శకుడిగా తన ముద్ర ఏంటో చూపించారు శ్రీచరణ్ పాకాల. పదేళ్లుగా సాగుతున్న త కెరీర్‌లో థ్రిల్లర్ చిత్రాలే ఎక్కువగా కనిపిస్తుండొచ్చు కానీ.. స్వతహాగా ప్రేమకథలు, మాస్ కథలు, కామెడీ టచ్ ఉన్న కథలకి సంగీతం ఇవ్వడం అంటే ఇష్టం అని చెప్పారు శ్రీచరణ్. ఇక స్నేహితులతో పని చేయడం ఎంత సులభమో, వాళ్లని సంతృప్తిపరిచేలా వర్క్ ఇవ్వడంలోనూ అన్నే సవాళ్లు ఉంటాయి అని చెప్పారు.
ఇన్నాళ్లూ బడ్జెట్‌తో సంబంధం లేకుండా తన (Sricharan Pakala) దగ్గరికి వచ్చిన ప్రతి సినిమాకూ మ్యూజిక్ చేశానని, కానీ ఇప్పుడు పరిమితంగానే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే సంగీతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగింది అంటున్నారు. కానీ అది పరిమితంగానే ఉందని తెలిపారు. ఇక ఆయన తర్వాతి సినిమాలు చూస్తే… కాజల్ ‘సత్యభామ’, అడివి శేష్ ‘గూఢచారి 2’ సినిమాలు ఉన్నాయి.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!