వైరల్: సిరి ఆ పోస్ట్ ను ఎందుకు డిలీట్ చేసినట్టు…!

‘బిగ్ బాస్5’ సక్సెస్ ఫుల్ గానే ముగిసింది. ఈసారి ఎక్కువ వివాదాలు అయితే జరగలేదు. కాకపోతే షణ్ముఖ్ సిరిల వ్యవహారమే పెద్ద సంచలనంగా మారింది. ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉన్నన్ని రోజులు వీళ్ళు ఇష్టమొచ్చినట్టు హగ్గులు, ముద్దులు పెట్టుకుంటూ గడిపేశారు.వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి మరీ రెచ్చిపోయారు. ఆ వ్యవహారాన్ని ప్రపంచం మొత్తం చూసి బోలెడన్ని ట్రోల్స్ గుప్పించడం కూడా జరిగింది. ఇక ‘బిగ్ బాస్’ ముగిసిన కొద్దిరోజులకే దీప్తి సునైనా..

షణ్ముఖ్ లు బ్రేకప్ అవ్వడం జరిగింది. అంత ఈజీగా ఎలా బ్రేకప్ అయిపోయారో ఎవ్వరికీ అర్ధం కాదు. హౌస్ లో ఉన్నన్ని రోజులు షణ్ముఖ్.. దీప్తి పేరుని తలుచుకుని ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు సిరి- శ్రీహాన్ లు కూడా బ్రేకప్ దిశగా అడుగులు వేస్తున్నారా? అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. శ్రీహాన్ తన సోషల్ మీడియాలో సిరితో ఉన్న ఫోటోలు డిలీట్ చేస్తూ వస్తున్నాడు అని బయట టాక్ నడుస్తుంది.

అంతేకాదు సిరితో దూరం మెయింటైన్ చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా సిరి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి.. డిలీట్ చేయడం మరింత చర్చనీయాంశం అయ్యింది. ఆ పోస్ట్ లో “ఎవరైనా నీ వద్దకు వచ్చి నీ జీవితం కఠినంగా ఉందని అంటే నేను దాని కంటే కఠినంగా ఉన్నాను అని జవాబిచ్చి నవ్వండి” అనే అర్ధం వచ్చేలా ఓ కామెంట్ చేసింది.

తర్వాత దానిని సిరి డిలీట్ చేయడంతో ‘ఈమె కూడా శ్రీహాన్ తో బ్రేకప్ అయ్యే అవకాశం ఉందా?’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొన్ననే శ్రీహాన్ తో కలిసి సిరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. అయినా ఇలాంటి కామెంట్స్ వినిపించడం ఏంటో?

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Share.