Srikanth Addala, Balakrishna: బాలయ్య శ్రీకాంత్ అడ్డాల కాంబోలో మూవీ.. కానీ?

స్టార్ హీరో బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాకు, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అతి త్వరలో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అనిల్ రావిపూడి కూడా బాలయ్య కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే అన్ స్టాపబుల్ సీజన్ 1ను పూర్తి చేసిన బాలకృష్ణ ప్రస్తుతం కొత్త కథలను వింటున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన స్క్రిప్ట్ కు బాలయ్య ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అఖండ అనూహ్య విజయం తర్వాత స్టార్ డైరెక్టర్లతో పాటు యంగ్ డైరెక్టర్లు కూడా బాలయ్యతో సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో సినిమా అంటే బాలయ్య ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడుతున్నారు.

ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన ముకుంద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటే బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. నారప్ప సినిమా అసురన్ రీమేక్ కాగా ఈ సినిమాకు కూడా బ్లాక్ బస్టర్ టాక్ రాలేదనే సంగతి తెలిసిందే. అయితే బాలయ్య శ్రీకాంత్ అడ్డాల కాంబో మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయినా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా సమయం పడుతుందని చెప్పవచ్చు. అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య కెరీర్ విషయంలో, సినిమాల స్క్రిప్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బాలయ్య వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చే ఏడాది ఒక సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus