Srikanth: ఆ రెండు విషయాలు చాలా బాధపెట్టాయి: శ్రీకాంత్

సినీ నటుడు శ్రీకాంత్ ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన తెలుగు తమిళ భాష చిత్రాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ శ్రీకాంత్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈయన ఒకవైపు తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ భాష చిత్రాలలో కూడా భాగమవుతున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీకాంత్ (Srikanth) వరుస ఇంటర్వ్యూలకు హాజరయ్యారు ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన తన సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన భార్య పిల్లల గురించి కూడా శ్రీకాంత్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఏంటో ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. రోషన్ ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని శ్రీకాంత్ తెలిపారు.

అలాగే తన చిన్న కుమారుడు రోహన్ కూడా ఒక హిందీ సినిమాలో నటించారని ఆ సినిమాలో ప్రభుదేవాకు కొడుకు పాత్రలో రోహన్ ఎంతో అద్భుతమైన పాత్రలో నటించారు కానీ ఈ సినిమా చివరిలో ప్రొడ్యూసర్స్ కారణంగా సినిమా విడుదలకు నోచుకోలేదని శ్రీకాంత్ తెలిపారు. తన చిన్న కుమారుడికి సినిమాలు అంటే చాలా ఇష్టమని తప్పకుండా హీరోగా ఎంట్రీ ఇస్తాడు అంటూ ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు. ఇక తన కుమార్తె మేధా ప్రస్తుతం కెనడాలో ఉన్నత చదువులు చదువుతోందని తను చాలా ఇంటిలిజెంట్ అంటూ శ్రీకాంత్ తన పిల్లల గురించి తెలియజేశారు.

ఇక తన భార్య ఊహ గురించి మాట్లాడుతూ నేను ఇంట్లో వారికి ఏం కావాలో అవి మాత్రమే సమకూరుస్తాను కానీ తన భార్య పిల్లల విషయాలన్నింటినీ కూడా తానే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందని ఈయన వెల్లడించారు. ఇక మీ జీవితంలో ఏదైనా బాధ పెట్టిన సంఘటనలు ఉన్నాయా అంటే.. అది నేను విడాకులు తీసుకుని విడిపోతున్నామని, నేను చనిపోయాను అంటూ కొన్ని వెబ్సైట్స్ వార్తలు రాయడం చాలా బాధ కలిగించింది అంటూ ఈ సందర్భంగా (Srikanth) శ్రీకాంత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus