తెలుగులో ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్నేళ్లలో హీరోగా నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో శ్రీకాంత్ హీరో పాత్రలకు దూరమయ్యారు. జగపతిబాబులా విలన్ పాత్రలతో సత్తా చాటాలని శ్రీకాంత్ భావిస్తున్నారు. అఖండ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శ్రీకాంత్ నటించగా ఆ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ పెద్ద ఎవరనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి తాను ఇండస్ట్రీ పెద్ద కాదని ఇండస్ట్రీ బిడ్డనని పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన దృష్టిలో ఇండస్ట్రీ పెద్ద అంటే చిరంజీవి మాత్రమేనని శ్రీకాంత్ అన్నారు. చాలా సంవత్సరాలుగా చిరంజీవి ఎంతోమందికి సాయం చేస్తూ వస్తున్నారని శ్రీకాంత్ తెలిపారు. పరిశ్రమలో ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైతే మొదట చిరంజీవిని మాత్రమే కలుస్తారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
అన్నయ్య మనం చెప్పిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి అనడంలో సందేహం అవసరం లేదని శ్రీకాంత్ కామెంట్లు చేశారు. జగన్ సర్కార్ టికెట్ రేట్ల అంశం గురించి చర్చించడానికి మొదట చిరంజీవినే ఆహ్వానించిందని శ్రీకాంత్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించిందంటే ఇండస్ట్రీలో ఆయన స్థానం ఏంటో అర్థమవుతుందని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. చరణ్ శంకర్ కాంబో మూవీలో కూడా శ్రీకాంత్ కీలక పాత్రను పోషిస్తున్నారని సమాచారం అందుతోంది.
వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో ఆఫర్లను సొంతం చేసుకుంటూ శ్రీకాంత్ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీకాంత్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అఖండ సక్సెస్ తర్వాత శ్రీకాంత్ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని సమాచారం.